వయస్సు, పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మీ.. ఏమన్నారంటే?

మూడు పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోని యాంకర్ల జాబితాలో రష్మీ గౌతమ్ ముందువరసలో ఉన్నారు.రష్మీ గౌతమ్ పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని ఆమె అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

 Anchor Rashmi Gautam Sensational Comments About Age And Marriage In  Zee Telugu-TeluguStop.com

అయితే రష్మీ మాత్రం తాజాగా ఒక షోలో పాల్గొని వయస్సు గురించి, పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇంతకాలం ఈటీవీకే పరిమితమైన రష్మీ ప్రస్తుతం ఇతర ఛానెళ్ల స్పెషల్ ఈవెంట్లలో కూడా కనిపిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం జీ తెలుగు ఛానల్ లో ఈ ఈవెంట్ సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది.ఈ ఈవెంట్ కు రష్మీ హాజరై తన స్టెప్పులతో దుమ్ములేపారు.

రవి సంగీత గారే సూపర్ గా చేశారని చెప్పగా రష్మీ చేయి వేయగానే మీరే సూపర్ అని రవి చెబుతాడు.అప్పటినుంచి వాళ్లు తనపై గట్టిగా పంచ్ లు వేస్తున్నారని రవి చెప్పగా వెయ్యాలి వెయ్యకపోతే ఎలా అని రష్మీ గౌతమ్ రవికి ధీటుగా కౌంటర్ ఇస్తుంది.

యాంకర్ శ్యామల రష్మీ యు డోంట్ బికమ్ అత్త యు కోడలు అని చెప్పగా ఈ వయస్సులో ఇంకా పెళ్లి కాలేదని తాను డైరెక్ట్ గా అత్తను అవుతానని శ్యామలతో రష్మీ షాకింగ్ కామెంట్లు చేశారు.రవి ఈసారి మధ్యలో వచ్చావో ఉన్నది కూడా తీసేస్తానంటూ రష్మీ షాకింగ్ పంచ్ లు వేశారు.రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరించగా సంగీత ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం గమనార్హం.

మెరిసిందే మేఘం మేఘం అంటూ రష్మీ తనలోని సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టారు.సంగీత డ్యాన్స్ వేసి తన స్టెప్పులతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.రష్మీ గౌతమ్ తన్ డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు.

రష్మీ గౌతమ్ కొత్త ప్రోగ్రామ్స్ తో కూడా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube