జపాన్ ఒలంపిక్స్ మెడల్స్ ని ఎలా తయారు చేసిందంటే..?!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ గేమ్స్ మొదలైపోయాయి.వీటిని చూడటానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 How Did The Japan Made The Olympic Medals , Japan, Olympics, Models, Prepare, Vi-TeluguStop.com

జపాన్ దేశం టోక్యో వేదికగా ఈ గేమ్స్ ను నిర్వహిస్తోంది.సాధారణంగా ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించాలంటే అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జపాన్ కూడా ఈ ఒలింపిక్స్ గేమ్స్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఒలింపిక్స్ ఏర్పాట్లు చేయడంలో కొన్ని ముఖ్య కార్యక్రమాలను నిర్వహించడంలో జపాన్ సర్కార్ నూతన టెక్నాలజీని వినియోగిస్తోంది.

జపాన్ లోని ఓ గొప్ప టోక్యో క్రీడా నగరాన్ని నిర్మించింది.విజేతలకు ఇచ్చేటటువంటి పతకాల తయారీని ఓ కొత్త విధానంలో తయారు చేసింది.

ఆధునికతతో పాటుగా సంప్రదాయాన్ని మాత్రం మరిచిపోని విధంగా పతకాలను తయారు చేయిస్తోంది.

జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ మెడల్స్ ను కొంగొత్త రూపంలో రెడీ చేసిందని చెప్పొచ్చు.

గేమ్స్ ఆడటానికి మూడు సంవత్సరా క్రితమే కొన్ని ప్రణాళికలను రూపొందించింది.ఎలక్ట్రానిక్ చెత్తను ఓ మంచి పనికి ఉపయోగించాలనుకుంది.

తమ దేశానికి చెందిన పాత మొబైల్ ఫోన్లను ఒక చోటుకు చేర్చింది.ఆ పాడైపోయిన ఎలక్ట్రానిక్ లోహంతో కూడిన విడిభాగాలను వేరు చేసింది.

ఆ లోహపు భాగాలను కరిగించి వాటితో మెడల్స్ తయారు చేయిస్తోంది.ఈ పతకాలను ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో రూపొందిస్తోంది.

ఇకపోతే ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్ ల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

Telugu Bronze Medal, Gold Medal, Japan, Models, Olym, Prepare, Silver Medal, Ups

ఈ మెడల్స్ ను సంప్రదాయమైన పద్ధతిలో రెడీ చేయిస్తోంది.జపాన్ లో తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్ రూపొందిస్తోంది.పతకాలను ఉంచేందుకు కలపతో ప్రత్యేకమైనటువంటి బాక్సులను రెడీ చేస్తోంది.

పతకాలను గెలుపొందినవారు ఎవరికి వారే మెడలో పతకాలను వేసుకోవాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, జపాన్ సర్కార్ తెలియజేసింది.ప్రస్తుతం కరోనా వ్యాపించకుండా అనేక నియమాలు, సూచనలతో ఇటువంటి కార్యక్రమాలకు జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ గేమ్స్ లో శ్రీకారం చుట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube