బిడెన్ కు ఇది అతిపెద్ద సవాల్...కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..!!!

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు గొప్ప చిక్కొచ్చి పడింది.కరోనా మొదటి వేవ్ లో అమెరికా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కుందో అందరికి తెలిసిందే.

 U.s. Weekly Jobless Claims Increases, Us Unemployment, Delta Variant, Joe Biden,-TeluguStop.com

లక్షలాది మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.చిన్నా, పెద్దా లేకుండా ప్రజలు మృత్యువాత పడ్డారు.

కుటుంబాలకు కుటుంబాలకు కరోనా ధాటికి రోడ్డున పడ్డాయి.మరో పక్క లాక్ డౌన్ కారణంగా కంపెనీలు, ఫ్యాక్టరీలు, బిజినెస్ లు మూతపడటంతో ఎంతో మంది ఉపాది కోల్పోయారు.

చేతిలో చిల్లిగవ్వ లేక తినడానికి తిండి లేని పరిస్థితులు ఎదుర్కున్నారు అమెరికా ప్రజలు.ఈ క్రమంలోనే


అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

అమెరికా ప్రజలను ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నిరుద్యోగ బృతిని ప్రవేశపెట్టారు.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులు మినహా మిగిలిన వారు నిరుద్యోగ బృతికి అర్హులుగా కొన్ని మార్గదర్సకాలు జారీ చేసింది.

దాంతో లక్షలాది దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి.అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం ఈ దరఖాస్తులు చూసి షాక్ అయ్యింది కూడా.

అయితే బిడెన్ ప్రభుత్వం వచ్చిన తరువాత కరోనా సెకండ్ వేవ్ ను వ్యాక్సినేషన్, సామాజిక దూరం అంటూ దాదాపు అదుపులోకి తెచ్చింది.అయితే డెల్టా వేరియంట్ మొదలవుతుందని అనుకున్న సమయంలో బిడెన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు అమెరికన్స్.

Telugu Americans, Biden, Covid Effect, Delta, Jobless, Joe Biden, Weeklyjobless-

కరోన ఓ ఊపు ఊపేసిన అంతా సర్దుకుంది అనుకున్న తరువాత కూడా ఎంతో మందికి ఉపాది కరువయ్యింది , ఉద్యోగాలు లేక అమెరికన్స్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు.దాంతో నిరుద్యోగ బృతి కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.గడిచిన రెండు నెలల క్రితం 3.68 వేల దరఖాస్తులు రాగా తాజాగా కేవలం రెండు వారాలలో 4.19 వేల దరఖాస్తులు వచ్చాయని అమెరికా లేబర్ శాఖ అధికారులు ప్రకటించారు.కరోన పరిస్థితులు అదుపులోకి వచ్చి అంతా బాగున్న తరువాత కూడా ఈ స్థాయిలో నిరుద్యోగ బృతి దరఖాస్తులు వచ్చిపడటంతో బిడెన్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.

డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరగడంతో నిరుద్యోగ బృతి ధరఖాస్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube