లంచం ఇవ్వ‌క‌పోతే ఇంత దారుణం చేస్తారా..!

ప్రజెంట్ సొసైటీలో లంచం అనేది కామన్ థింగ్‌గా మారిపోయింది.లంచం తీసుకోవడం తప్పు అని చెప్పాల్సిన ప్రజలే లంచం ఇచ్చి మరీ తమ పనులు చేయించుకోవడం మనం గమనించొచ్చు.

 If You Do Not Pay A Bribe, You Will Be So Cruel Police, Bengaluru, Dharmendra Ku-TeluguStop.com

అన్ని వ్యవస్థలను లంచం అనే భూతం పీడిస్తుండగా, పోలీసు శాఖలోనూ అది ఉన్నది.ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన నలుగురు పోలీసుల లంచగొండితనం వల్ల ఓ చిరు వ్యాపారి తీవ్రంగా నష్టపోయాడు.

లంచం కోసం పోలీసు వారు ఎంతటి దారుణానికి ఒడిగట్టారనే విషయం తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

బెంగళూరుకు చెందిన చిరు వ్యాపారి శివరాజ్ తోపుడు బండిపై తన చిన్న వ్యాపారం చేస్తున్నాడు.

కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో అతడు అష్టకష్టాలు పడ్డాడు.ఈ క్రమంలోనే ఇటీవల తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.అయితే, గతంలో మాదరి పోలీసులకు లంచం ఇచ్చేందుకు నిరాకరించాడు శివరాజ్.దాంతో పోలీసులు ఈ చిరువ్యాపారిపై కక్షగట్టారు.లంచం ఇవ్వడానికి నిరాకరించినందును అతడిని అక్రమ కేసులో ఇరికించారు.ఓ పథకం ప్రకారం.అతడి చేత గంజాయి నింపిన సిగరెట్ తాగించారు.అనంతం మెడికల్ టెస్టులు చేసి నిషేధిత గంజాయి సేవించినట్లు వచ్చిన రిపోర్టుల ఆధారంగా చట్టం ప్రకారం అరెస్టు చేశారు.

కాగా, శివరాజ్ తాజాగా బెయిల్ ద్వారా విడుదలయ్యారు.అయితే, తనను పథకం ప్రకారమే కేసులో ఇరికించారని మనస్తాపం చెందిన శివరాజ్ ఆత్మహత్యాయత్నం చేశాడు.పురుగుల మందు తాగాడు.అది గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాలతో బయటపడ్డాడు.

తనను అన్యాయంగా అక్రమ కేసులో ఇరికించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు.దాంతో ఈ వ్యవహారమై పోలీసు ఉన్నత అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.

విచారణాధికారి డీసీపీ ధర్మేంద్ర కుమార్ మీనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా, పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Telugu Bengaluru, Benguluru, Shiv Raj, Si Anjinappa-Latest News - Telugu

లంచం ఇవ్వలేదనే ఎస్ఐ అంజినప్ప, ఇంకా ముగ్గురు పోలీసులు శివరాజ్‌పై గంజాయి కేసు పెట్టి వేధించినట్లు డీసీపీ నిర్ధారించారు.ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.రిపోర్ట్ స్టడీ చేసిన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆ నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు.

లంచం ఇవ్వలేదని ఇన్‌స్పెక్టర్స్ పార్వతమ్మ, అంజినప్ప, ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube