యూజర్ ఇంటర్ ఫేస్‌లో హిందీ: ఇండియాలో టెస్లా ఈవీ కార్ల ఎంట్రీకి రెడీ..!!!

అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టెస్లా.భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తోంది.

 Tesla Cars With Hindi Language Support On Test India Launch In Full Swing, Auto-TeluguStop.com

జనాభాలో ప్రపంచంలోనే రెండవ స్థానం.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కావడంతో ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారతదేశంపై ఉంది.

తగినంత మార్కెట్, పెట్టుబడులకు అనుకూలించే వాతావరణం ఇక్కడ ఉండటంతో ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్పోరేట్ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారతీయ రోడ్లపై పరుగులు పెట్టనున్నారు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా టెస్లా.ఈవీ వెహికల్స్ మోడ్రాన్ టెక్నాలజీతో భారతీయులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తయారీదారులను కోరింది.అలాగే పలు రాయితీలను సైతం కల్పించింది.

ఈ పరిస్ధితుల నేపథ్యంలోనే టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ భారత్‌లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్నారు.అయితే ఇప్పుడు రాబోయే టెస్లా ఈవీ కార్లలో యూజర్ ఇంటర్ ఫేస్ UI (infotainment)ను అనేక భాషల్లో అందిస్తోంది.

అందులో తాజాగా హిందీని కూడా చేర్చింది టెస్లా.హిందీ మాట్లాడే టెస్లా కస్టమర్లు తమ ఈవీ కారుని సొంత భాషలో కమాండ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు.దీనికి సంబంధించి లాంగ్వేజ్ అప్ డేట్స్ స్క్రీన్ షాట్ ను టెస్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అందులో టెస్లా కారు కమాండ్స్ హిందీలో కనిపిస్తున్నాయి.

భారత్‌లో ఎక్కువ మంది మాట్లాడగలగడంతో పాటు హిందీని అర్ధం చేసుకునేవారు ఎక్కువే.అందుకే హిందీ మాట్లాడే కస్టమర్లకు మరింత చేరువయ్యేలా టెస్లా కారులో ఈ కొత్త ఇంటర్ ఫేస్ లాంగ్వేజీలను ప్రవేశపెట్టింది.

భారతీయ భాషల్లోనే కాదు.విదేశీ భాషలైన రష్యన్, గ్రీక్, క్రొయేషియన్, ఫిన్నీస్ కూడా యూజర్ ఇంటర్‌ఫేస్‌లో చేర్చింది.

టెస్లా కారులోని కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ లో భాగంగా ఈ కొత్త భాషలను చేర్చింది.ఈ ఏడాది జనవరిలోనే టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది.

Telugu Croatian, Finnish, Greek, Russian, Teslacars, Tesla Elan Musk, Teslaelect

ఈ మేరకు బెంగళూరులో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం ఇండియానే అవుతుంది.భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది.2025 నాటికి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.మొత్తం రూ.50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు… వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది.వీటికి తోడు రాబోయే రోజుల్లో భారత్‌లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube