ఈ నెల 25వ తారీకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు..!!

మార్చి నెలలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు అప్పటి పిటిషన్ పై జరిగిన విచారణలో హైకోర్టు పోలింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కౌంటింగ్ ఆపివేయడం జరిగింది.

 Eluru Corporation Counting Of Votes On The 25th Of This Month Eluru Corporation-TeluguStop.com

ఆ తర్వాత మే ఏడోవ తారీకు కౌంటింగ్ కి డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ ఆలస్యం అవడం జరిగింది.

ఇదిలా ఉంటే హైకోర్టు ఆదేశాలు బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ నెల 25వ తారీకు సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీ లో ఉదయం 8 గంటల నుండి.ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Telugu Ap, Ap Poliitics, Eluru, Ysrcp-Telugu Political News

కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.ఏలూరు తో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 11 కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.ఇక ఏలూరు కార్పొరేషన్ రిజల్ట్ లో కూడా వైసీపీ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్.

స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది.దాదాపు మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా 47 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ఆదివారం తెలియనుంది.57 డివిజన్లో 26 సీట్లు గెలిస్తే మేయర్ పదవి రావడం గ్యారంటీ.ఈ క్రమంలో ఏలూరు మేయర్ పదవి పీఠాన్ని ఎవరి అధిరోహిస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube