'సినోఫార్మా టీకాతో డెల్టా వేరియంట్‌కు చెక్‌!'

డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు.అయితే, శ్రీలంకకు చెందిన శ్రీ జయవర్ధనే యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం చైనా తయారు చేసిన సినోఫార్మా టీకా అత్యంత సమర్ధవంతంగా డెల్టా వేరియంట్‌పై పనుచేస్తుందని చెబుతున్నారు.

 Sinopharm Vaccine Highly Efficient Against Delta Variant: Study, Alpha Varian,-TeluguStop.com

ఈ వ్యాక్సిన్‌ను డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు.దీనిపై సమర్థ పరిశోధనలు చేశామన్నారు.

డెల్టా వేరియంట్‌ న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ సమానంగా పనిచేస్తున్నాయని ఈ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.ఓ నివేధిక ప్రకారం 95 శాతం మంది రెండు డోసులు సినోఫార్మా టీకా తీసుకున్నవారిలో సాధారణ కొవిడ్‌ 19 వ్యక్తుల మాదిరిగానే యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందాయని జిన్హువా వార్తా ఏజెన్సీ తెలిపింది.

ఈ పరిశోధనలో శ్రీలంకన్‌ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ నీలిక మాలవిగే, ఇమ్యూనాలజీ హెడ్, శ్రీ జయవర్ధనే యూనివర్శిటీకి చెందిన మాలిక్యూలర్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ చండిమా జీవంధర, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు గ్రహం ఒగ్, ప్రొఫెసర్‌ అలైన్‌ టౌంసెండ్‌ ఉన్నారు.ప్రొఫెసర్‌ నీలిక మాట్లాడుతూ.

సినోఫార్మా దేశంలో అందుబాటులో ఉన్న కారణంగా దాన్ని ఎక్కువ శాతం వాడామని, ఈ టీకా బాగా పనిచేసిందని తెలిపారు.ఇప్పటి వరకు దాదాపు 4.63 మిలియన్‌ తమ దేశస్థులు మొదటి డోసు సినోఫార్మా టీకా తీసుకున్నారన్నారు.1.29 మిలియన్‌ మంది రెండో డోసు కూడా తీసుకున్నారని, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఏ సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని చెప్పారు.అంతేకాదు ఇటువంటి పరిశోధన ప్రపంచంలోనే మొదటిదని, నిపుణులు సినోఫార్మా టీకా నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలించారని ప్రొఫేసర్‌ మాలావిగే అన్నారు.

ఈ టీకాను అల్ఫా, బీటా వేరియంట్లతోపాటు కోవిడ్‌ వైరస్‌తో కూడా పోల్చామని చెప్పారు.డెల్టాతోపాటు ఇతర వేరియంట్ల విషయానికి వస్తే సినోఫార్మా టీకా సాధారణ వ్యక్తికి ఉన్నట్లే యాంటీబాడీస్‌ రెస్పండ్‌ అవుతున్నాయని మాలవిగే అన్నారు.20–40 వయస్సు వారిలో దాదాపు 98 శాతం యాంటీ బాడీస్‌ వృద్ధి చెందగా 60 ఏళ్లు పైబడిన వారిలో 93 శాతం యాంటీ బాడీస్‌ వృద్ధి చెందడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఆమె చెప్పారు.ఎందుకంటే సాధారణంగా వృద్ధులకు టీకాకు స్పందించడం తక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube