త‌న రాజ‌కీయ ఎంట్రీపై ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ క్లారిటీ.. త్వ‌ర‌లోనే ప్ర‌జాక్షేత్రంలోకి..!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఊహించని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో, టీఆర్ ఎస్‌, బీజేపీల్లో అనూహ్య ప‌రిణామాలో చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే.

 Rs Praveen Kumar Clarity On His Political Entry Soon Will Join Peoples Side, Rs-TeluguStop.com

కాంగ్రెస్‌కు కొత్త బాస్‌గా రేవంత్ రెడ్డి, అలాగే బీజేపీలోకి ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌, వైఎస్ ఆర్ బిడ్డ ష‌ర్మిల కొత్త పార్టీ లాంటివి తెలంగాణ రాజకీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే.కాగా ఇప్పుడు రాష్ట్రంలోనే మంచి ఇమేజ్ ఉన్న ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన ఆర్‌.

ప్ర‌వీణ్ కుమార్ త‌న ప‌ద‌వికి వీఆర్ ఎస్ తీసుకోవ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.ఎందుకంటే ఆయ‌న ఇప్పుడు గురుకులాలా సెక్రెట‌రీగా ఉన్నారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసాడని ఆయ‌న టీఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తాడంటూ చాలా రూమ‌ర్లు కొన‌సాగుతున్నాయి.ఇక ఆయ‌న సొంత పార్టీ కూడా పెడ‌తారంటూ ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

కానీ అస‌లు ఆయ‌న స్టెప్ ఏంట‌నేది ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు.అయితే ఇప్పుడు ఆయ‌న ఈ పుకార్ల‌న్నింటిపై క్లారిటీ ఇచ్చారు.

రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో బహుజనులే కేంద్ర బిందువుగా తెలంగాణ‌లో ఒక కొత్త‌రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని, ఆ మేర‌కు త‌న కృషి ఉంటుంద‌ని వివ‌రించారు.

Telugu Congress, Retired Ips, Revanth Reddy, Telangana-Political

ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు పెద్ద‌గా ఎలాంటి న్యాయం జరగట్లేద‌ని, వారిని పూర్తి స్థాయిలో ఎద‌గ‌నీయ‌ట్లేద‌ని, అందుకోస‌మే త‌న కృషి ఉంటుందని చెప్పారు.ప్రభుత్వ పథకాల కోసం తెలంగాణ‌లో నిత్యం ఎదురు చూస్తున్న 99శాతం జ‌నాభా ల‌క్ష్యంగానే త‌న అడుగులు ఉంటాయ‌ని వివ‌రించారు.బహుజనుల అభివృద్ధి కోసమే త‌న ఐపీఎస్ పదవిని వ‌దులుకున్నాన‌ని, త‌న అడుగు బ‌హుజ‌నుల కోస‌మేనంటూ వివ‌రించ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతోంది.

అయితే త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ అనే దానిపై ఇప్ప‌డు క్లారిటీ ఇవ్వ‌లేన‌ని ఆయ‌న వివ‌రించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube