కెసీఆర్ దళిత సంక్షేమ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ సీఎం కెసీఆర్ ముందు ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ ఉందనే విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే కాక సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని పలు రకాల పధకాల ప్రకటనపై కెసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 Will Kcr Dalit Welfare Strategy Work Kcr, Trs Party, Kcr Dalitha Bandhu , Ts Pol-TeluguStop.com

అయితే తాజాగా కెసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ పధకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుండి మొదలు కానుంది.

అయితే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను కేటాయించి దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పధకం ప్రధాన ఉద్దేశ్యం.అయితే ఈ వ్యూహాన్ని హుజూరాబాద్ లో ప్రయోగించి ఇక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు కెసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ నెల 26 న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులతో కెసీఆర్ సమావేశం కానున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ పధకంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే.

దళిత వర్గంలో 36 ఉప కులాలు ఉంటాయని దళితులంటే మాల.మాదిగలు మాత్రమే కాదని ఉప కులాల వారికి కూడా న్యాయం చేయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది.మరి కెసీఆర్ ఈ దళిత సంక్షేమ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube