అంతా ఆమె ఇష్టమేనా ? ఎస్ మేడమ్ అనల్సిందేనా ? 

చాలా రోజులుగా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి హడావుడి చేస్తున్న వైఎస్ షర్మిల కు సంబంధించి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఆమె తెలంగాణ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చారు.

 Own Party Leaders So Many Comments On Sharmila Desistions  Ys Sharmila, Telangan-TeluguStop.com

కొత్త పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని చూస్తున్నారు.అందుకే టిఆర్ఎస్ పార్టీ తో పాటు, బిజెపి, కాంగ్రెస్ తదితర పార్టీలన్నిటినీ టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.పార్టీలో యువ నాయకుల ప్రాధాన్యం పెంచేందుకు నిరుద్యోగ దీక్ష ప్రతి వారం చేపడుతూ, తెలంగాణ యూత్ ను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే తెలంగాణలోని అన్ని ప్రధాన సమస్యల పైన స్పందిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

యినా షర్మిల పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడంపై  రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

అసలు షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన సమయంలో లోటస్ పాండ్ వద్ద పెద్ద హడావుడి నడిచేది.భారీ ఎత్తున నాయకులు పార్టీలోకి క్యూకట్టారు.అలాగే టిఆర్ఎస్ ,బిజెపి కాంగ్రెస్ లో చేరే అవకాశం లేని వారందరికీ షర్మిల పార్టీ ఆశాదీపంలా కనిపించడింది.వీరే కాకుండా ఇతర పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులలోనూ షర్మిల పార్టీ పై ఆసక్తి కలిగింది.

దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంతా ఆశించినా, ఆ విధంగా జరగకపోవడం కాస్త ఆందోళన షర్మిల పార్టీ లో కనిపించింది.

Telugu Lotuspond, Sharmilamma, Telangana, Trs, Ys Rajashekara, Ys Sharmila, Ysrc

అయితే పార్టీ పేరు ప్రకటించిన తర్వాత ఎక్కువ మంది చేరుతారు అని అంతా అంచనా వేశారు.కానీ పేరు ప్రకటన పూర్తయినా పెద్దగా చేరికలు కనిపించకపోవడంతో షర్మిల పార్టీ పై నీలి నీడలు అలుముకున్నాయి.దీనికి కారణం షర్మిల వ్యవహార శైలి కారణంగా తెలుస్తోంది.

పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో షర్మిల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీలోని నాయకులు ఎవరిని కనీసం సంప్రదించడం లేదని, ఆమే నిర్ణయం తీసుకుని, అమలు చేయాలని మాత్రమే ఆదేశాలు ఇస్తున్నారని, పార్టీలో తమకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Telugu Lotuspond, Sharmilamma, Telangana, Trs, Ys Rajashekara, Ys Sharmila, Ysrc

ఇప్పటికే చేరినవారు అసంతృప్తితో ఉండడంతో, కొత్తగా చేరాలనుకున్న వారు వెనకడుగు వేస్తున్నారట.అదీకాకుండా షర్మిలను షర్మిలమ్మ అంటూ పిలవాలని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కొంతమంది షర్మిల అనుచరులు ఆదేశాలు ఇస్తున్నారని, సాధారణంగా మాట్లాడుకునే సమయంలోనూ షర్మిలమ్మ అంటూ సంబోదించాలని చెబుతుండడం, షర్మిల నిర్ణయం ఏదైనా ఎస్ అనడమే తప్ప మరో ఆప్షన్ ఉండడంలేదని ఈ తరహా వ్యవహారాలు తెలంగాణలో సెట్ కావని, ఇదే తరహాలో షర్మిల వ్యవహరించుకుంటూ వెళితే ముందు ముందు పార్టీ కి భవిష్యత్తే ఉండదు అంటూ మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.పార్టీపై ఈ రకమైన చర్చ జరుగుతుండడం షర్మిల కు ఇబ్బందికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube