నారప్ప కొడుకులు మునికన్న, సీనప్ప ల గురించి ఆసక్తికరమైన విషయాలు

తెలుగులో తాజాగా రిలీజ్ అయిన నారప్ప సినిమా సంచలన విజయం సాధించింది.కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో విజయం సాధించింది.

 Unknown Facts About Narappa Sons, Narappa Movie , Tollywood , Venkatesh , Priyam-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నారప్ప సినిమా గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమా ఏమేరకు ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది.

తన అద్భుత నటనతో అదరగొట్టింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత తనలోని నటనను అంతా బయటకు తీశాడు అని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నారప్ప చిన్నకొడుకు సీనప్ప.

తన కళ్ల ముందే సొంత అన్నను చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకునే క్యారెక్టర్ లో సీనప్ప అద్భుతంగా నటించాడు.అయితే సీనప్ప అసలు పేరు గీతాకృష్ణ.

రాఖీ అని కూడా ఇతడిని పిలుస్తారు.కొద్ది రోజుల క్రితమే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన ఈ కుర్రాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తను ఈ సినిమాలో కనిపించడం పట్ల తన తల్లిదండ్రులతో పాటు బంధు మిత్రులు ఎంతో సంతోష పడుతున్నట్లు తెలిపాడు.ఈ సినిమాలో అవకాశం రావడానికి ప్రధాన కారణం తన అన్నయ్య అని చెప్పాడు.

Telugu Githa Krishna, Karthik Aratna, Munikanna, Ppa, Priyamani, Seenappa, Srika

అటు ఈ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినట్లు చెప్పాడు.రంగస్థలంలో చిన్న క్యారెక్టర్ చేసినట్లు చెప్పాడు.కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా ఎడిటింగ్ లో అవి కట్ అయినట్లు వెల్లడించాడు.తాజాగా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ రావడానికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు.

అటు హీరో విక్టరీ వెంకటేష్ పాత్ర కూడా చాలా ఉందన్నారు.ఆయన సపోర్ట్ తనను ఎంతగానో ప్రోత్సహించిందని చెప్పాడు.

సినిమాలో వెంకటేష్ నటన చూసి ఎమోషనల్ గా ఫీలైనట్లు చెప్పాడు.చాలా సార్లు కంటనీళ్లు కూడా వచ్చాయన్నాడు.

నారప్ప సినిమా తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు.

Telugu Githa Krishna, Karthik Aratna, Munikanna, Ppa, Priyamani, Seenappa, Srika

ఇక నారప్ప పెద్దకొడుకు పాత్రలో కనిపించింది కార్తీక్ రత్న మునికన్నా పాత్రలో కార్తీక రత్న జీవించేసాడు.మొదటిసారి కెమెరా ఫేస్ చేస్తున్న భయం లేకుండా చక్కగా నటించాడు కార్తీక్ రత్న.తన పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ ఈ సినిమాపై అతని ప్రభావం చక్కగా పడింది అని చెప్పుకోవాలి ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని సినిమాలో నటించబోతున్నాడు కార్తీక్ రత్న.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube