వైరల్ వీడియో: 22వేల మంది చూస్తుండగా లవ్ ప్రపోజ్.. చివరకి..?!

ప్రేమంటే అదొక గొప్ప అనుభూతి.అందులో ఎవరు ఎవరిని ముందుగా ప్రపోజ్ చేస్తారో చెప్పలేం.తాజాగా ఇక్కడొక వ్యక్తి తన ప్రేయసిని ప్రపోజ్ చేశాడు.అది కూడా 22 వేల మంది చూస్తుండగా అతను ప్రపోజ్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ లో ఈ ఘటన జరిగింది.

 Viral Video: Love Proposal While 22 Thousand People Are Watching .. Finally ..?!-TeluguStop.com

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు.ఆమె అతడి ప్రపోజ్ ను యాక్సెప్ట్ చేసింది.

ప్రియుడు ఇచ్చిన ఉంగరం స్వీకరించి కన్నీళ్లు పెట్టుకుంది.చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లతో వారి ప్రేమకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ ఘటన గురించి కామెంటేటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ మాట్లాడ్డం అందరికీ నవ్వును తెప్పించింది.

ఆ యువకుడు తలపై ఉన్న టోపి తీసి చేతిలో ఉంగరం పట్టుకుని మోకాళ్లపై కింద కూర్చొన్నాడు.

ఆ యువతి దానిని చూసి భావొద్వేగానికి లోనైంది.దానికి కామెంటర్ కూడా వాయిస్ కలిపాడు.అక్కడ ఏమి జరుగుతోంది.22 వేల మంది ముందు ప్రపోజ్ చేశాడు.అయితే డెసిషన్ పెండింగ్ లో ఉంది అని చెబుతుండగా అంతలోనే ఆ యువతి ఉంగరం తీసుకుని చేతి వేలికి పెట్టుకుంది.ఓ ఆమె తన ప్రేమను యాక్సెప్ట్ చేసేసింది అంటూ కామెంటరీ ఇచ్చాడు.‘ఎస్‘ అని చెప్పిన ఆ యువతి కన్నీళ్లతో ఆనందం వ్యక్తం చేసింది.

ఇలా ప్రపోజ్ చేసుకున్న వీడియోను ట్విట్టర్ వేదికగా ఇంగ్లండ్ యాజమాన్యం పోస్టు చేసింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ తమ అధికారిక ట్విటర్‌ అకౌంట్ లో పోస్టు చేసింది.కాగా మ్యాచ్‌ 9వ ఓవర్‌ చివర్లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖార్‌ జమాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇక చివరిదైన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 2 – 1 తేడాతో సిరీస్‌ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ లవర్స్ ప్రపోజ్ చేసుకున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube