టాలీవుడ్ కు పెద్ద దిక్కు లేదా..?

దాసరి నారాయణ రావు ఉన్నంతవరకు టాలీవుడ్ పెద్ద దిక్కుగా ఆయన ప్రతి విషయానికి ముందు ఉంటూ వచ్చారు.అయితే దాసరి కాలం చేశాక టాలీవుడ్ పెద్ద దిక్కుగా ఉన్న వారిలో కాస్త కూస్తో మెగాస్టార్ చిరంజీవి తన వంతు బాధ్యతగా చేస్తూ వస్తున్నారు.

 Manchu Vishnu About Tollywood Industry Maa Elections, Tollywood Industry Maa Ele-TeluguStop.com

సినీ పరిశ్రమకు సంబందించిన ఏ చిన్న విషయాన్నైనా ఈమధ్య చిరంజీవి బాధ్యతగా పట్టించుకున్నారు.చిరు చేసిన సేవలు గుర్తించబడలేదని లేటెస్ట్ గా మంచు విష్ణు కామెంట్స్ చూస్తే అర్ధమవుతుంది.

మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు లేటెస్ట్ గా తన కామెంట్స్ లో టాలీవుడ్ కు పెద్ద దిక్కు లేకుండా పోయిందని అన్నారు.ఏయన్నార్, దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎవరు లేరని చెప్పాడు.

మంచు విష్ణు కామెంట్స్ పై సినీ పరిశ్రమలోనే కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తానో స్టార్ హీరో హోదాలో ఉండి మిగతా వారిలా చేతులు కట్టుకు కూర్చోకుండా చిరు తనకు తోచినట్టుగా సినీ పరిశ్రమ పెద్దగా ఉంటూ వస్తున్నాడు.

అలాంటిది చిరు చేసిన ఈ కార్యక్రమాలేమి మంచు విష్ణుకి కనబడలేదా అని కామెంట్స్ వస్తున్నాయి. మంచు విష్ణు కావాలనే అలా మాట్లాడాడని.

మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా ఉండటం వల్లే మంచు విష్ణు ఇలా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube