ఈ టెస్లా కారు గురించి విన్నారా.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఏకంగా..!

శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వల్ల రోజురోజుకూ కాలుష్యం బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ పొల్యూషన్‌ను తగ్గించేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం మేలని నిపుణులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నాయి.

 Have You Heard About This Tesla Car  If You Charge It Once , Tesla Car, New Vers-TeluguStop.com

ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ రూపొందిస్తున్నాయి.తాజాగా అమెరికాకు చెందిన కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ ఈ ఏడాది ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇటీవల మూడు కార్లను బెంగళూరుకు పంపింది.కాగా టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.

కాగా, ఈ టెస్లా ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.అవేంటంటే.

Telugu Alan Musk, Android, Heardtesla, Ios Phone, Tesla Car, Tesla Electric-Late

ఈ ఎలక్ట్రిక్ టెస్లా కార్లలో మోడల్స్ కూడా ఉండగా, మోడల్ 3 కారు ఆపరేట్ చేయడానికి కీ అవసరమే లేదు.ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌తో కారును నియంత్రించొచ్చు.ఇక ఈ టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.

ఈ కారు 6 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగం వరకు పుంజుకోవడం విశేషం.ఇక టెస్లా టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు నడవడం గమనార్హం.

కాగా, ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.టెస్లా మోడల్ 3 కారును అయితే మీ పాకెట్‌లో ఉండే ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు.

అయితే, ఈ మోడల్ 3 టెస్లా కారుకు ధర కూడా ఎక్కువగానే ఉండే చాన్స్ ఉంది.సుమారుగా రూ.70 లక్షల వరకు ప్రైస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ టెస్లా మోడల్ 3 కారు ఇప్పటికే దేశంలో ఆల్రెడీ ఉంది.

ప్రముఖ బిజినెస్‌మ్యాన్ ముకేశ్ అంబానీ ఈ కారును కొనుగోలు చేసి యూజ్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube