వైరల్.. వాడేసిన మాస్కులతో వెడ్డింగ్ డ్రెస్.. ఇలా కూడా చేస్తారా..!

కరోనా కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.తినడానికి తిండి లేక ఉన్న ఉపాధిని కూడా కోల్పోతూ బతకాలని ఆశ కూడా వదిలేసుకుంటూ జీవిస్తున్నారు.

 Wedding Gown Made Entirely Of 1500 Discarded Face Masks In England ,uk, Wedding-TeluguStop.com

ఇంకా రోజు పని చేస్తేనే కడుపునిండే కూలీలా గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.ఈ కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో రోజువారీ కూలీలకు పూట గడవడమే కష్టమైంది.

అలాగే కరోనా కారణంగా చాలా పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి.కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా పెళ్లి తంతు జరుపుకుంటే.మరి కొంతమంది మాత్రం పెళ్లిని వాయిదా వేసుకున్నారు.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లు కూడా కొనుడి మందు బంధువుల మధ్యలో జరుగు తున్నాయి.

మన దేశంలో ఇప్పటికే చాలా మంది బంధువులతో పెళ్లిళ్లు జరుపు కుంటున్నారు.

Telugu England, Gown, Marriages, Masks-Latest News - Telugu

అలాగే ఇంగ్లాండ్ లో కూడా ఈ మధ్యనే పెళ్లిళ్ల పై పెట్టిన ఆంక్షలను ఎత్తి వేశారు.దీంతో ఒక డిజైనర్ వెడ్డింగ్ డ్రెస్ ను రెడీ చేసారు.ఇప్పుడు ఆ వెడ్డింగ్ డ్రెస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇందులో అంత పెద్ద విశేషం ఏముంది.అని అనుకుంటున్నారా.

ఇది ప్రత్యేకమే మరి.ఎందుకంటే ఈ డ్రెస్ ను సాధారణంగా తయారు చేయలేదు.వాడి పడేసిన మాస్కులతో తయారు చేసారు.

Telugu England, Gown, Marriages, Masks-Latest News - Telugu

అందుకే ఈ డ్రెస్ గురించి ఇప్పుడు అందరు మాట్లాడు కుంటున్నారు.దీనిని ప్రముఖ డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ తయారు చేసారు.ఈ డ్రెస్ కోసం దాదాపు 1500 వాడి పడేసిన తెలుపు రంగు మాస్కులను వాడారని ఆయన తెలిపాడు.

ఈ మాస్కుల వల్ల పర్యావరణానికి హానికరం అవుతుందని అందుకే అవగాహనా కోసం ఇలా డ్రెస్ తయారు చేశామని తెలిపాడు.మీరు కూడా ఈ డ్రెస్ ఎలా ఉందొ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube