ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకు దక్కని క్రెడిట్‌ ఆర్ఆర్ఆర్‌కు..!

హాలీవుడ్‌ సినిమాలతో పోటీగా ఇండియన్ సినిమాలు రూపొందుతున్నాయి.కాని ఇండియన్‌ సినిమాలు అంటే ఈమద్య ఎక్కువగా తెలుగు సినిమాలే గుర్తుకు వస్తున్నాయి.

 Rrr Movie Gets Rare Record , Flim News, News In Telugu, News In Tollywood, Rajam-TeluguStop.com

తెలుగు సినిమాలు భారీగా రూపొందడంతో పాటు హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు.అందువల్ల తెలుగు సినిమా లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుంది.

బాలీవుడ్‌ సినిమాలకు కూడా దక్కని ఎన్నో గౌరవాలు తెలుగు సినిమాలకు దక్కుతున్నాయి అనడంలో సందేహం లేదు.తెలుగు సినిమాల్లో ముఖ్యంగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అనడంలో సందేహం లేదు.

Telugu Telugu, Tollywood, Rajamouli-Movie

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్‌ ను కలిగి ఉంది.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండే బాలీవుడ్‌ సినిమా లను సైతం బీట్‌ చేసే విధంగా సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు.ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‌ ను ఒక ప్రముఖ ఓటీటీ వారు డాక్యుమెంటరీగా విడుదల చేసేందుకు భారీ మొత్తంకు గాను హక్కులను కొనుగోలు చేశారు.సినిమా మేకింగ్‌ ను డాక్యుమెంటరీగా తీయడం అనేది ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కు కూడా గౌరవం దక్కలేదు.

అలాంటి గౌరవం కేవలం ఆర్ ఆర్‌ ఆర్‌ కు దక్కడం తెలుగు వారు అందరు కూడా గర్వించాల్సిన విషయం అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఎన్టీఆర్‌.

చరణ్‌ లు నటించారు.జక్కన్న ఈ సినిమా ను అద్బుతంగా రూపొందించాడు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే అక్టోబర్‌ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube