న్యూస్ రౌండప్ టాప్ 20

1.భారత్ లో కరోనా

 గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

2.సర్పంచ్ లకు శిక్షణ

  ఏపీలో సర్పంచ్ లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం.ఈ ఈ శిక్షణ కార్యక్రమం ఆగస్టు 14వ తేదీ వరకు ఉంటుంది.
 

3.నాలుగో రోజుకు చేరుకున్న ఈటెల పాదయాత్ర

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది.
 

4.రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి

  తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ లో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన బుధవారం నాటికి పూర్తయింది.దాదాపు 3.60 లక్షల మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది.
 

5.పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పై సమీక్ష

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని తెలంగాణ మంత్రి ఇ ప్రశాంత్ రెడ్డి బుధవారం సమీక్షించారు.
 

6.రామగుండంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

  గత రెండు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రామగుండం రీజియన్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.ఓపెన్ కాస్ట్ లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ఆ పరిసరాలన్నీ బురదతో నిండిపోవడంతో బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడుతుందనే ఉద్దేశంతో రామగుండం రీజియన్ లోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు.
 

7.ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 25 నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
 

8.జగన్ కు రఘురామ లేఖ

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  విశాఖ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ  కృష్ణం రాజు లేఖ రాశారు.
 

9.ఇన్సూరెన్స్ కోసం బెంజ్ కారు దగ్ధం

  ఇన్సూరెన్స్ కోసం బెంజ్ కారు పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని వ్యవహారం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో చోటుచేసుకుంది.11 నెలల క్రితం కొత్తగా కొనుగోలు చేసిన బెంజ్ కారు తాళాలు పోవడంతో స్నేహితులు సలహా మేరకు కారు యజమాని రవీంద్రారెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేయడంతో, కారు తో పాటు స్నేహితుడు నాగరాజు కు తీవ్ర గాయాలయ్యాయి.ఈ విషయం పోలీసులకు తెలియడంతో యజమాని తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
 

10.27నుంచి బేస్ లైన్ పరీక్షలు

  పాఠశాల సంసిద్ధత, బోధన అభ్యసన కార్యక్రమంలో భాగంగా ఏపీ లో విద్యార్థులకు ఈనెల 27 నుంచి 31 వరకు బేస్ లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.విద్యార్థులు ఇళ్ల దగ్గర ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
 

11.పశ్చిమ లో రైతుల మహాపాదయాత్ర

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు మహా పాదయాత్ర చేపట్టారు.పాలకొల్లు ఎడ్ల బజార్ నుంచి నర్సాపురం వరకు 12 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేపట్టారు.రైతుల ఆకలికేకల పేరుతో జోరువానలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
 

12.ఏపీలో ముంపు ప్రాంతాలకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది

  ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళగిరి ఎన్టీఆర్ రక్షణ సిబ్బంది ముంపు ప్రాంతాలకు తరలి వెళ్లారు.విశాఖపట్నం కు రెండు , పోలవరం, దేవీపట్నం కు రెండు భద్రాచలంకు ఒకటి, కర్ణాటక రాష్ట్రానికి నాలుగు బృందాలు తరలి వెళ్ళాయి.
 

13.వంద మందికి ‘ గిఫ్ట్ ఏ స్మైల్ ‘ : కేటీఆర్

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ లో భాగంగా వందమంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.
 

14.లోక్ సభలో వైసీపీ ఎంపీల ఆందోళన

  తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పై లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.
 

15.ఫోన్ ట్యాపింగ్ లు దారుణం

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఫోన్ టైపింగ్ చేయడం దారుణమని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

16.ఏపీలో కరోనా

  గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 2,527 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

17.త్వరలో తిరుమలలో ఏకొలా స్టిక్ బ్యాగులు

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే కంపోస్టబుల్ ఎకో లాస్తిక్ సంచుల్లో అందించే ఏర్పాట్లు చేస్తోంది.
 

18.ఐదు పైసల నాణేనికి బిర్యానీ

  తమిళనాడులోని మధురై నెల్లూర్ రోడ్డు లో బుధవారం కొత్తగా ప్రారంభించిన బిర్యాని దుకాణం వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించింది.ప్రారంభోత్సవం సందర్భంగా పాత ఐదు పైసల నాణెం తో వచ్చే వారికి బిర్యాని ఉచితం అని ప్రకటించింది.దీంతో పెద్ద ఎత్తున జనాలు 5 పైసల నాణెం తో షాప్ ముందు క్యూ కట్టారు.
 

19.అది వెబ్ సిరీస్ .పోర్న్ కాదు : రాజ్ కుంద్రా

Telugu Ap Telangana, Corona, Etela Rajendra, Huzurabad, Jagan, Mallu Ravi, Ndrf,

  అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్ ద్వారా వాటిని విడుదల చేస్తున్నారు అన్న ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే దీనిపై తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.అరెస్ట్ కు కారణమైన వీడియో షూట్ ఏదైతే ఉందో అది పోర్న్ కాదని, వెబ్ సిరీస్ మాత్రమే అని తెలిపారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47, 110   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,110

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube