మళ్లీ పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్.. ఫోటో వెనుక అసలు కథ ఇదే..?

ఈ మధ్య కాలంలో నిత్యం ఏదో ఒక వివాదం ద్వారా వనితా విజయ్ కుమార్ పేరు వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి.

 Actress Vanitha Vijay Kumar  Shares Marriage Photo With Tamil Power Star Sriniva-TeluguStop.com

అయితే తాజాగా వనితా విజయ్ కుమార్ ఒక ఫోటోను షేర్ చేయగా ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గతేడాది పీటర్ పాల్ ను పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్ పెళ్లైన కొన్ని నెలలకే అతనితో బంధాన్ని రద్దు చేసుకున్నారు.

పీటర్ పాల్ మద్యానికి బానిసైన వ్యక్తి అని అతనిని భరించలేనని వనితా విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

మూడో భర్తకు దూరమైన తర్వాత వనితా విజయ్ కుమార్ కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టారు.పలు సినిమాలలో నటించడానికి వనిత ఓకే చెప్పడంతో పాటు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ వేధిస్తున్నారని సంచనలన ఆరోపణలు చేసి ఒక రియాలిటీ షోకు గుడ్ బై చెప్పారు.

తమిళనాడు పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీనివాసన్ తో కలిసి దిగిన ఫోటోను వనిత షేర్ చేశారు.

Telugu Fourth, Kollywood, Netizens, Peter Paul, Ramyakrishna, Srinivasan, Tamil,

అయితే వనితా విజయ్ కుమార్ సినిమాలో పెళ్లి చేసుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే వనితా విజయ్ కుమార్ నిజంగానే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమానార్హం.వనితా విజయ్ కుమార్ మరో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె నెటిజన్ నుంచి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది.

Telugu Fourth, Kollywood, Netizens, Peter Paul, Ramyakrishna, Srinivasan, Tamil,

వనితా విజయ్ కుమార్ ప్రవర్తన ఆమె అభిమానులకు కూడా నచ్చడం లేదు.రమ్యకృష్ణతో వివాదం వల్ల ఆమెను వ్యతిరేకించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వనితా విజయ్ కుమార్ పెళ్లి విషయంలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube