కెనడా: పేరెంట్స్, గ్రాండ్‌ పేరెంట్స్‌ కోటా పెంపు... ఇక పెద్దలూ మీతో పాటే, భారతీయులకు మేలు..!!

ఆధునిక సమాజం తెచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది.ఉన్నచోటే కూర్చుంటే జీవితంలో ఎదగలేరు.

 Canada Announces Details Of Parents And Grandparents Program 2021, Canada, Immig-TeluguStop.com

అందుకే కష్టమైనా నష్టమైనా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విదేశాల బాట పడుతున్నారు ప్రజలు.ముఖ్యంగా యువత అయితే చిన్న నాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అందుకు తగినట్లుగా జీవితాన్ని మలచుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఖండాలు దాటుతున్నారు.అక్కడ ఎంత సాధించినా, ఎందరి మన్ననలు పొందినా.

అయినవారు పక్కన లేరన్న బాధ వెంటాడుతూనే వుంటుంది.కని, పెంచి, ప్రయోజకుణ్ణి చేసిన తల్లిదండ్రులు, తాతయ్య నానమ్మలు కూడా తమతే పాటే వుండాలని భావిస్తుంటారు.

కానీ ఒకటి రెండు దేశాలు మినహా చాలా దేశాల్లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అందుకు అనుకూలంగా వుండవు.అయితే అత్యంత సులభతరమైన నిబంధనలతో ఇప్పుడు కెనడా.

వలసదారులకు డెస్టినేషన్‌గా మారింది.ఇప్పటికే అక్కడ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్‌ను తమతో పాటు తెచ్చుకోవచ్చు.

అయితే వలసదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకుని కెనడా ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

గతంలో ప్రతియేటా ఇలాంటి వారికి కేవలం 10వేల మందికి మాత్రమే కెనడా వచ్చేందుకు అనుమతి ఉండేది.

ఇప్పుడు ఈ కోటాను 40 వేలకు పెంచింది.అంటే ఇకపై ప్రతి ఏడాది అదనంగా 30 వేల మంది పేరెంట్స్, గ్రాండ్‌పేరెంట్స్‌‌ను అక్కడ స్ధిరపడ్డవారు కెనడా తీసుకెళ్లొచ్చు.

పేరెంట్స్ అండ్ గ్రాండ్‌పేరెంట్స్‌ ప్రొగ్రామ్ (పీజీపీ)లో భాగంగా ఇప్పటి నుంచి ప్రతియేటా అదనంగా 30వేల దరఖాస్తులను అదనంగా స్వీకరించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.కుటుంబ సభ్యులను తిరిగి కలిసి ఉండేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది.

ఇక కెనడాలో ఇండో-కెనడియన్ల జనాభా వేగంగా వృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.అక్కడి అన్ని రంగాల్లో భారతీయులు దూసుకెళ్తున్నారు.అందువల్ల ఈ పీజీపీ కార్యక్రమం వల్ల భారీగా లబ్ధి పొందేది ఇండియన్సేనని చెప్పొచ్చు.సెప్టెంబర్ 20 నుంచి ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

రెండు వారాల పాటు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎవరి దరఖాస్తులకు ఆమోదముద్ర పడుతుందో వారు వారి తల్లిదండ్రులు, తాతామామ్మలను కెనడాకు తీసుకురావడానికి అనుమతి పొందుతారు.

Telugu Canada, Canada Program, Indo Canadians, Program-Telugu NRI

పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్ కింద వచ్చే 30,000 దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) విభాగం డ్రా తీస్తుంది.18 ఏళ్ల వయసు నిండిన కెనడా పౌరులు, శాశ్వత నివాసులు, స్టేటస్ ఫస్ట్ నేషన్స్‌లు మాత్రమే ఈ పీజీపీ స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube