భర్తను హింసించే భార్యపై గృహ హింస కేసు..! కోర్టు సంచలన తీర్పు..!

తాజాగా ఢిల్లీ హై కోర్టు ముందుకు ఓ పిటిషన్ వచ్చింది.దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 Domestic Violence Case Against Wife Who Abuses Husband Delhi Court Sensational V-TeluguStop.com

గృహహింస చట్టం హైకోర్టు సంచలన ప్రకటన చేసింది.ఇకనుంచి మహిళలపై కూడా గృహహింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది.

భార్యలను భర్తల వేదించడమే కాదు భార్యలు భర్తలను కూడా వేధిస్తున్నారు అనే పిటిషన్లపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఇక నుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

భర్తలు కూడా న్యాయం కోసం పోరాడవచ్చిని తెలిపింది.మహిళలపై రోజురోజుకూ జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు (43/2005 చట్టం) గృహహింస నిరోధక చట్టాన్ని 2005 లో పార్లమెంట్ లో అమల్లోకి తెచ్చారు.

ఈ చట్టం మాత్రం 2007లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది.జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీన్ని అమలు చేస్తుంది.

ఆ శాఖ జిల్లా పిడిని రక్షణాధికారి గా వ్యవహరిస్తున్నారు.కేసులు నమోదు బాధితులకు సహాయం చేసేందుకు ఒక కౌన్సిలర్ తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది.

Telugu Abuses, Delhi-Latest News - Telugu

కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు అంటున్నారు.ఈ క్రమంలో వేసిన పిటీషన్ పై  విచారించిన ఢిల్లీ హైకోర్టు భర్త కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube