బయటకొచ్చిన ఫన్ బకెట్ భార్గవ్.. దుమ్ముదులుపుతున్న నెటిజెన్లు!

కొన్ని రోజుల కిందట ఫన్ బకెట్ భార్గవ్మైనర్ బాలికను లొంగదీసుకొని ఆమెను గర్భవతిని చేసిన సంగతి తెలిసిందే.దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేయగా దేశం మొత్తం ఫన్ బకెట్ భార్గవ్ పై ఓ రేంజ్ లో మండిపడింది.

 Fun Bucket Bhargav, Netizens, Tik Tok, Social Media,latest News Viral-TeluguStop.com

కొన్ని రోజులు జైలు లో ఉన్న భార్గవ్ తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.ఇక ఇతనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతున్నారు.

సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్.అంతేకాకుండా యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో కొంత మంది అమ్మాయిలతో కూడా వీడియోలు చేసేవాడు.

దీంతో అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు భార్గవ్.కానీ అంతే త్వరగా తన పేరును కోల్పోయాడు.ఇక ఈయనకు టిక్ టాక్ లో 14 ఏళ్ల మైనర్ బాలిక పరిచయం కావడంతో తనకు మరింత పేరు అందిస్తానని చెప్పి నమ్మించాడు.

Telugu Netizens, Tik Tok-Movie

ఆమెను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయగా ఆ బాలిక నో అనడంతో చెల్లి అని పిలిచేవాడని తెలిసింది.దీంతో ఆమె దుస్తులు మార్చుకునే సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.ఇక ఇతడిపై ఏప్రిల్ 16న దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇక బాధితురాలు గురించి ఎటువంటి ఆధారాలు కూడా బయట పెట్టలేదు పోలీసులు.అలా కొన్ని రోజులు జైల్లో ఉన్న భార్గవ్ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

అందులో నేను మళ్ళీ వస్తున్నాను.అంతే కాదు మీ సపోర్టు కావాలని కోరాడు.

ఇక ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.మళ్లీ ఎందుకు వచ్చావని, ఎవరి సపోర్టు కావాలని అడుగుతున్నావ్ అని నోటికొచ్చిన మాటలతో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube