తెలుగు ఎన్ఆర్ఐ డైలీ రౌండప్

1.అమెరికా ప్రయాణం .భారత విద్యార్థుల పై భారం

భారత్ నుంచి అమెరికాకు వెళ్లి విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరగడంతో భారత విద్యార్థులపై భారం పడింది.కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెరికాకు తక్కువ సంఖ్యలో సర్వీసులు నడుస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri New, India To America, Praveen-TeluguStop.com

భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో విమాన టికెట్  రేట్లను ఆపరేటర్లు అమాంతం పెంచారు.సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లేందుకు ఎకనామిక్ తరగతి టికెట్ ధర 60 వెలు ఉండగా,  ప్రస్తుతం 90 వేల నుంచి 2.20 లక్ష వరకు ఉంది.
 

2.బ్రిటిష్ నేవీ లో భారతీయుడి హవా

Telugu Donald Trump, India America, Jagjitsingh, John, Nirav Modi, Nri, Nri Telu

  విదేశాల్లో భారతీయులు తమ సత్తా నిరూపించుకంటూనే వస్తున్నారు.ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో భారత్ బ్రిటన్ దేశాలకు చెందిన నౌక దళాలు సంయుక్త విన్యాసాలు జరగనున్నాయి.ఈ విన్యాసాలు బ్రిటిష్ రాయల్ నేవీ లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జగ్జీత్ సింగ్ గ్రే వాల్ భాగమయ్యారు.యూకే నేవీ లోని అతి పెద్ద విమాన వాహక నౌక హెచ్ ఎం ఎస్ క్వీన్ ఎలిజిబిత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో ఆయన క్రూ మెంబర్ గా ఉన్నారు.
 

3.ట్రంప్ సన్నిహితుడికి జైలు శిక్ష

  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన టామ్ బరాక్ ను  మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరఫున ఆయన అక్రమంగా లాభియింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతోనే ఆయనను అరెస్టు చేశారు.
 

4.వైట్ హౌస్ లో కరోనా టెన్షన్

Telugu Donald Trump, India America, Jagjitsingh, John, Nirav Modi, Nri, Nri Telu

  అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తూనే ఉంది.ఇప్పటికే థర్డ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మరింత టెన్షన్ పెరుగుతోంది.ఇక వైట్ హౌస్ లోనూ కరోనా కలకలం సృష్టిస్తునే ఉంది.వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ అక్కడి అధికారులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది  దీనిపై వైట్స్ సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు.
 

5.అమెజాన్ అధ్యక్షుడి రోదసీ యాత్ర .అవార్డ్ ప్రకటించిన బెజోస్

  అమెజాన్ అధినేత ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్  రోదసీ యాత్ర విజయవంతం అయింది.ఈ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తరువాత బెజోస్ కీలక ప్రకటన చేశారు.

అంతరిక్షం లోకి వెళ్లి వచ్చిన తర్వాత కరేజ్ అండ్ సివిలిటీ అనే అవార్డును ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ , సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ అనే ఇద్దరికి ఇవ్వనున్నట్టు తెలిపారు.ఈ అవార్డు కింద ఇరువురికి 100 మిలియన్ డాలర్లు ( 746.02 కోట్లు) ఇవ్వనున్నారు.

6.శ్రీలంక కొబ్బరి ఆహా ఏమి రుచి

Telugu Donald Trump, India America, Jagjitsingh, John, Nirav Modi, Nri, Nri Telu

  శ్రీలంకలో కొబ్బరికాయలను డార్క్ రమ్ గా పిలుస్తారు.అక్కడ ప్రభుత్వానికి ఇదే ప్రధాన ఆదాయ వనరు కావడంతో , ప్రభుత్వం కల్లు తయారీని ప్రోత్సహిస్తోంది.కాక్ టైల్ లో ఉపయోగించే మత్తుపానీయం గా దీన్ని శ్రీలంక మార్కెటింగ్ చేస్తుండడంతో విదేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది .విదేశీయులు సైతం ఇష్ట పడుతుండడంతో డిమాండ్ బాగా పెరిగింది.శ్రీలంక లోని నాలుగు కల్లు ఉత్పత్తి సంస్థలు ప్రతి ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లు ను ఉత్పత్తి చేస్తున్నాయి.
 

7.రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ ప్రయత్నం

  బ్రిటన్ లో అధికారిక రహస్యాలు చట్టాన్ని మార్చేందుకు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కథనాలు రాసి జర్నలిస్టులకు ఇకపై 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.
 

8.భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్యే : నిరవ్ మోడీ

Telugu Donald Trump, India America, Jagjitsingh, John, Nirav Modi, Nri, Nri Telu

  బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయన్ని భారత్ కు అప్పగించే ప్రయత్నాలు.చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై లండన్ కోర్టులో అప్పీల్ కు వెళ్లిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.తనను భారత్ కు అప్పగించ వద్దని, అలా అప్పగిస్తే ఆత్మహత్య శరణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

9.భారత మహిళను 8 ఏళ్లు బానిసలా హింసించి.చివరకు.

  భారతీయ మహిళన ఎనిమిదేళ్లుగా బానిసల హింసించిన మెల్ భోర్న్ దంపతులకు జైలు శిక్ష పడింది.శ్రీలంకకు చెందిన ఈ దంపతులు ఇద్దరు భారత మహిళ పై కనీస మానవత్వం లేకుండా ప్రదర్శించారని విక్టోరియా సుప్రీం కోర్ట్ జస్టిస్ జాన్ ఛాంపియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బాధిత మహిళ తమిళనాడుకు చెందిన వారు కాగా, ఈమె ఆస్ట్రేలియాలో ఈ దంపతులు వద్ద పనికి వెళ్లి హింసకు గురయ్యారు.

10.గల్ఫ్ వెళ్లేవారికి కేంద్రం భరోసా

Telugu Donald Trump, India America, Jagjitsingh, John, Nirav Modi, Nri, Nri Telu

  కోవేట్ తీసుకుని గల్ఫ్ దేశాల కు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారికి కేంద్రం భరోసా కల్పించే విధంగా ప్రకటన చేసింది.కో వ్యాక్సిన్ టీకా కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు తీసుకు వచ్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవర్ రాజ్యసభలో తెలిపారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది గుర్తింపు పై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు.

   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube