అక్కినేని తొలి సినిమాతోనే ఎలా ఎదురు దెబ్బ తిన్నాడు.. అవకాశం ఎవరు ఇప్పించారు

అక్కినేని నాగేశ్వర్ రావు.తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రనటుడు.

 Akkineni First Movie Experience In Tollywood , Akkineni, Y. Bhadrachari, P Pulla-TeluguStop.com

ఎన్టీఆర్ తో సమకాలికుడు.ఈ ఇద్దరు ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపారు.

నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏఎన్నార్.దశాబ్దాల తరబడి అగ్ర నటుడిగా వెలుగొందాడు.జానపద సినిమాలతో మొదలైన ఆయన ప్రస్తానం.ఆ తర్వాత సాంఘిక చిత్రాలతో కొనసాగింది.ప్రేమకథా సినిమాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.తన తుదిశ్వాస వరకు కళామతల్లి సేవలోనే కొనసాగాడు.

అక్కినేని 1924 సెప్టెంబ‌ర్ 20న కృష్ణా జిల్లా వెంక‌ట‌రాఘ‌వాపురంలో జన్మించాడు.తన ఊరి నుంచి రెండు మైళ్లు నడుచుకుంటూ వెళ్లి చదువకునే వాడు.ఆరోజుల్లోనే కొందరు కుర్రాళ్లతో కలిసి నాటకాలు వేసేవాడు.అలా తొలిసారి సావిత్రి అనే నాటకం వేశారు.

అందులో నాగేశ్వర్ రావు నారదుడి పాత్రను వేశాడు.తన అన్న రామబ్రహ్మంకు నాగేశ్వర్ రావు మంచి నటుడు అవుతాడనే నమ్మకం ఎక్కువ.

అందుకే తనకు నాటకాల్లో శిక్షణ ఇప్పించాడు.

Telugu Akkineni, Raghuramayya, Pullaya, Ramabraham, Shantakumari, Bhadrachari-Te

కొంత కాలం తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో నాగేశ్వర్ రావు చదువు మాన్పించాడు రామబ్రహ్మం.అనంతరం తనను సినిమాల్లో చేర్పించాలని తనకు పరిచయం ఉన్న కాజా వెంట్రామయ్య ద్వారా దర్శకుడు పి పుల్లయ్యకు నాగేశ్వర్ రావును పరిచయం చేయించాడు అన్న రామబ్రహ్మం.1941లో ధర్మపత్ని అనే సినిమాలో అవకాశం ఇప్పించాడు.శాంతకుమారి, ఉప్పులూరి హనుమంతరావు ప్రధాన పాత్రలో నటించారు.

అందులో అక్కినేనికి చిన్నవేషం ఇచ్చారు.అయినా ఈ సినిమా తనకు అంతగా కలిసి రాలేదు.

అదే సమయంలో మళ్లీ నాటకాలవైపు వెళ్లాడు నాగేశ్వర్ రావు.కుచేల‌, హ‌రిశ్చంద్ర నాట‌కాలాడుతున్న వై.

భ‌ద్రాచారి దగ్గర నాగేశ్వర్ రావును చేర్పించాడు రామబ్రహ్మం.అదే సమయంలో భద్రచారి దగ్గరున్న ఆయనకు పులిపాటి శెంకటేశ్వర్లు, కె.రఘురామయ్య లాంటి గొప్ప నటులతో నటించే అవకాశం కలిగింది ఏఎన్నార్ కు.ఆ తర్వాత తను సినిమా రంగంలోకి ప్రవేశించి.తిరుగులేని నటుడిగా ఎదిగాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube