నటి రాధ కి జరిగిన భయంకరమైన తొలి సినిమా అనుభవం గురించి ఏం చెప్పిందో తెలుసా?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటీమణి రాధ.మోస్ట్ ఇండియన్ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ.1981లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రాధ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది.వందల కొద్ది ఔట్ డోర్ షూటింగులకు వెళ్లింది.

 Actress Radha First Movie Bad Experience , Radha , First Movie , Kollywood , Tol-TeluguStop.com

అయితే తన జీవితంలో మరుపురాని ఔట్ డోర్ షూటింగ్ ఒకటి ఉందని చెప్పింది రాధ.ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం.

రాధ నటించిన తొలి సినిమా అలైగ‌ళ్ ఓయివ‌దిల్లై.ఈ సినిమా పూర్తిగా ఔట్ డోర్ లోనే జరిగింది.ఈ సినిమాకు అనుగుణంగా ఉండేలా నాగర్ కోయిల్ లో షూటింగ్ చేయాలని దర్శకనిర్మాతలు భావించారు.అప్పుడు రాధ పదోతరగతి చదువుతుంది.

కన్యాకుమారికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది నాగర్ కోయిల్.ఆమెకు ఆ ప్రాంతం ఎంతో నచ్చింది.

Telugu Actress Radha, Bad Experience, Kollywood, Nagar Koil, Tollywood-Movie

చక్కటి సముద్రం తీరంతో మరింత అందంగా ఉంది.అక్కడే ముట్టామ్ అనే రిసార్ట్ ఉంది.అక్కడే హీరో కార్తీక్ తో కలిసి ఓ పాటను చిత్రీకరించారు.అక్కడే సముద్రపు అలల మీద తేలియాడే సీన్ తీస్తుండగా అలల తాకిడికి రాధ సముద్రంలోకి కొట్టుకుపోతుంది.అంతలోనే యూనిట్ సభ్యులు అక్కడికి వచ్చి తనను కాపాడుతారు.తన జీవితంలో అదో భయంకర ఘటనగా ఆమె వెల్లడించింది.

Telugu Actress Radha, Bad Experience, Kollywood, Nagar Koil, Tollywood-Movie

ఈ ఒక్క ఘటన మినహా అక్కడ చాలా సంతోషంగా గడిపినట్లు చెప్పింది.మూడు నెలల పాటు జరిగిన షూటింగ్ ఆడుతూ పాడుతూ కొనసాగినట్లు చెప్పింది.ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు షూటింగ్ కొనసాగేదని.ఆ తర్వాత అక్కడ దగ్గర్లోని వింతలు, విశేషాలు చూసి వచ్చేదని చెప్పింది రాధ.ముట్టామ్ రిసార్ట్ సమీపంలో ఎన్నో చక్కడటి ప్రదేశాలుండేవని చెప్పింది.అక్కడ సెయింట్ జేవియర్ చర్చ్ చాలా నచ్చిందని వెల్లడించింది.

అక్కడున్న సరస్సుల అందులో విరబూచిన ఎర్రని తామరలు ఎంతో అందంగా ఉండేవన్నది.అక్కడున్న బీచ్ చాలా సుందరంగా ఉండేదని చెప్పింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు టూరిస్టులు వచ్చి వెళ్లేవారని చెప్పింది.కన్యాకుమారిలో ఉదయాస్తమయాలు అద్భుతంగా ఉండేవని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube