ఇప్పటి వరకు తెలుగులోకి రీమేక్ అయిన కొరియన్ సినిమాలేంటో తెలుసా?

అద్భుతమైనన కంటెంట్.చక్కటి స్ర్కీన్ ప్లే.

 Tollywood Movies Which Are Remakes Of Korean ,  James Bond,  My Wife Is A Gangst-TeluguStop.com

అంతకు మించిన టేకింగ్.ఇదీ సౌత్ కొరియన్ సినిమాల స్పెషాలిటీ.

ఒకప్పుడు ఆ దేశానికే పరిమితం అయిన సినిమాలు ఇప్పుడు అంతర్జాతీయంగా మార్కెట్ ను సంపాదించుకున్నాయి.గడిచిన దశాబ్ద కాలంగా అక్కడి సినిమాలకు మంచి గిరాకీ పెరిగింది.

అక్కడ హిట్ సాధించిన సినిమాలు.ఇతర భాషల్లో రీమేకై.

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి.తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా కొరియన్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే చాలా మంది ఆ సినిమాలను రీమేక్ చేయకుండా.సీన్లు కాపీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

కొరియ‌న్ సినిమాల్లోని యాక్ష‌న్ సీన్లు, డ్రామా సీన్లను మక్కీకి మక్కీదింపిన సందర్బాలు చాలానే ఉన్నాయి.ఇంతకీ అలా కాపీ కొట్టిన తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్ల‌రి న‌రేశ్ హీరోగా నటించిన సినిమా.జేమ్స్‌ బాండ్‌..నేను కాదు నా పెళ్లాం.

ఈ సినిమా ఫేమ‌స్ కొరియ‌న్ ఫిల్మ్ మై వైఫ్ ఈజ్ ఎ గ్యాంగ్‌స్ట‌ర్‌.ఈ సినిమాను తెలుగులో చాలా వరకు ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టారు.కానీ ఈ సినిమా రీమేక్ కాదు.ఇంతకు ముందు కూడా తెలుగులో కొన్ని కొరియన్ సినిమాలను రీమేక్ చేశారు.తార‌క‌ర‌త్న మెయిన్ రోల్ పోషించిన అమ‌రావ‌తి సినిమా కొరియ‌న్ ఫిల్మ్ హెచ్ కు రీమేక్‌.నానీ మూవీ పిల్ల జ‌మీందార్ కూడా ఎ మిలియ‌నీర్స్ ఫ‌స్ట్ ల‌వ్ అనే కొరియ‌న్ సినిమా ఆధారంగా తీసిందే.

ఆది, ర‌ష్మీ, వైభ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించి నెక్స్ట్ నువ్వే తమిళ మూవీ యామిరుక్క బ‌య‌మేకు రీమేక్.కానీ నిజానికి ఈ సినిమా ద క్వ‌య‌ట్ ఫ్యామిలీ అనే కొరియ‌న్ మూవీ.

Telugu Amravati, James Bond, Korean, Gangster, Nenukadu, Nuvve, Baby, Pilla Zami

తాజాగా కొరియ‌న్ హిట్ మిస్ గ్రానీ ల‌క్ష్మి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నందినీరెడ్డి ఓ బేబీ పేరుతో రీమేక్ చేసింది.దీంతో అఫిషియ‌ల్ రీమేక్స్ వైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు సైతం ఫోకస్ పెడుతున్నారు.ప్ర‌స్తుతం మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ తెలుగులో రీమేక్ అవుతోంది.డాన్సింగ్ క్వీన్ రీమేక్ రైట్స్‌ ను సురేశ్‌బాబు తీసుకున్నాడు.మ‌రో కొరియ‌న్ ఫిల్మ్ ల‌క్కీ కీ రీమేక్ హ‌క్కులు కూడా తీసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube