టాలీవుడ్‌ పై టీ ప్రభుత్వం ప్రేమ.. ఏపీ ప్రభుత్వంకు కోపమా?

టాలీవుడ్ సినిమాలు థియేటర్ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి.ఈ నెల చివరి వారం నుండే ఒకటి రెండు చిన్న సినిమాలు థియేటర్ రిలీజ్ కోసం వెయిట్‌ చేస్తున్నాయి.

 Tollywood Movies Ready To Release But Ap Gov Not Support , Flim News, Movie News-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.తెలుగు సినిమాలు మార్చి నుండి కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్‌ రిలీజ్ ఆగిపోయింది.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత షూటింగ్‌ లు ముగిసి ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

అవి ఆగస్టు సెప్టెంబర్‌ అక్టోబర్‌ ఇలా వరుసగా విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.భారీ సినిమాలు విడుదల కోసం ఉన్న ఈ సమయంలో థియేటర్లు టికెట్ల రేట్లు పెంచాలని భావిస్తున్నాయి.

కాని ఏపీ ప్రభుత్వం మాత్రం చాలా తక్కువగా వసూళ్లు చేయాలని ఆదేశించింది.ఇక తెలంగాణ లో మాత్రం టికెట్ల రేట్లు ఇండస్ట్రీకి చాలా మద్దతుగా ఉన్నాయి.

Telugu Telugu, Telugu Theaters, Tollywood-Movie

ఇప్పటి వరకు థియేటర్లలో పార్కింగ్‌ చార్జీని వసూళ్లు చేయకూడదు.కాని ఇప్పుడు థియేటర్లను కాస్త ఆదుకునేందుకు గాను సింగిల్ స్క్రీన్ థియేటర్ల లో పార్కింగ్‌ పీజును వసూళ్లు చేసుకోవచ్చు అంటూ రాష్ట ప్రభుత్వం నుండి జీవో వచ్చింది.టాలీవుడ్‌ సినిమా ల బడ్జెట్‌ లు విపరీతంగా పెరిగి పోయాయి.అందుకు అనుగునంగా ప్రభుత్వాలు కూడా థియేటర్ల మెయింటెన్స్ కు తగ్గట్లుగా టికెట్ల రేట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వంsw మాత్రం టాలీవుడ్‌ గురించి ఎలాంటి పట్టింపు లేదు అన్నట్లుగా టికెట్ల తో పాటు అన్ని విషయాల్లో కూడా నిరాశ కలిగించేలా ప్రకటనలు చేస్తుంది.థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇతర విషయాల పట్ల మాత్రం ఏమాత్రం టాలీవుడ్‌ డిమాండ్స్ కు ఓకే చెప్పడం లేదు.

చిరంజీవి వంటి పెద్దలు జగన్ తో పలు సార్లు చర్చలు జరిపినా కూడా పెద్దగా పలితం లేకుండా పోయింది.అందుకే ఏపీ ప్రభుత్వంకు టాలీవుడ్‌ పై కోపం ఉందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.

టీ ప్రభుత్వం మాత్రం ప్రేమను కురిపిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube