అలోవేరాలో మీకు తెలియని లాభాలు ఎన్నో!

కొన్ని దశాబ్దాలుగా కలబందను ఇంటి, సౌందర్య చిట్కాల్లో భాగంగా మనం వినియోగిస్తూనే ఉన్నాం.దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులకు అలోవెరాతో చెక్‌ పెట్టవచ్చు.

 The Unknown Benefits Of Aloevera Details, Acne, Alovera, Anti Ageing, Dark Circl-TeluguStop.com

యాక్నే, పిగ్మెంటేషన్‌కు కలబంద చాలా చక్కగా ఉపయోగపడుతుంది.దీనిలోని కూలింగ్‌ ప్రాపర్టీస్‌ పాడైపోయిన స్కిన్‌ను రిపేయిర్‌ చేస్తుంది.

అలోవేరాలో మీకు తెలియని మరిన్ని లాభాలు ఉన్నాయి ఆ వివరాలు తెలుసుకుందాం.

కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌మాములు స్కిన్‌ రంగు కంటే కళ్ల కిందివైపు భాగం మరింత నలుపు రంగులో కనిపిస్తుంది.

ఇది అందరిలో సాధారణం.నిద్రలేమి, స్ట్రెస్, కెఫైన్‌ వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల వస్తుంది.

ఈ డార్క్‌ సర్కిల్స్‌ను తగ్గించడానికి అలోవేరా జెల్‌ను రాత్రి పడుకునే ముందు పెట్టుకుని తెల్లవారు నీటితో కడుక్కుంటే డార్క్‌ సర్కిల్స్‌ సమస్యలు తగ్గిపోతాయి.

Telugu Acne, Aloevera, Darkcircles, Remover, Removedark-Telugu Health

పిగ్మెంటేషన్‌కు చెక్‌అలోవేరా జెల్‌లో అలోయిన్‌ ఉంటుంది.ఇది సహజసిద్ధంగా పిగ్మెంటేషన్‌పై ఫైట్‌ చేస్తుంది.ఇది స్కిన్‌ను కాంతివంతంగా చేస్తుంది.

పిగ్మెంటేషన్‌ ఉన్న ప్రాంతాల్లో రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోవాలి.ఉదయం గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.

మంచి ఫలితం కోసం వారంలో మూడుసార్లు పెట్టుకోవాలి.

యాంటీ ఏజింగ్‌ మాస్క్‌

Telugu Acne, Aloevera, Darkcircles, Remover, Removedark-Telugu Health

అలోవేరా కొల్లజెన్‌ అనే కణాలను పెంచుతుంది.ఇందులోని విటమిన్‌ ఈ, సీ ఉంటుంది.ఒక టేబుల్‌ స్పూన్‌ అలోవేరా జెల్‌ను పాలలో కలిపి అందులో ఓ స్పూన్‌ తేనే, కొన్ని రోజ్‌ వాటర్‌ చుక్కలు కలిపి ఫేస్‌మాస్క్‌ వేసుకోవాలి.

ఓ 20 నిమిషాలు పెట్టుకుని గోరువెచ్చని నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
యాక్నేను తగ్గించుకోవచ్చుకలబంద యాక్నే తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

రెండు వంతులు అలోవేరా జెల్‌లో ఒక వంతు మంచినీరు ఓ స్ప్రే బాటిల్‌లో తీసుకోవాలి.దీన్ని బాగా షేక్‌ చేసి, ముఖంపై స్ప్రే చేసుకోవాలి.
సహజసిద్ధమైన మేకప్‌ రిమూవర్‌ఓ టెబుల్‌ స్పూన్‌ అలోవేరా జెల్‌లో, స్పూన్‌ అలివ్‌ ఆయిల్‌ను ఓ బౌల్‌లో తీసుకోవాలి.ఈ మిక్స్‌ను కాటన్‌ బాల్స్‌తో మేకప్‌ను తొలగించవచ్చు.అలోవేరాలో చర్మాన్ని హైడ్రేట్‌ చేసి మాయిశ్చరైజ్‌ చేసే గుణం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube