రన్నింగ్ బస్సుకి ఊడిపోయిన వెనక టైర్లు.. తప్పిన పెను ప్రమాదం..!

40 మంది ప్రయాణుకులు ఉన్న తెలంగాణా ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా వెనక ఉన్న టైర్లు ఊడిపోయాయి.ఊహించని ఆ సంఘటనతో బస్సు వెనక భాగం ఒక్కసారిగా కిందకు ఒంగిపోయింది.

 Rtc Bus Tyre Came Out When Bus Running Torrur Telangana ,  Bus , Came Out,  Rtc,-TeluguStop.com

అందులో ఉన్న ప్రయాణీకులు ఒక్కసారి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు.అయితే బస్సు సగటు వేగంతో వెళ్లడం వల్ల వెంటనే ఆపేసి ఏం జరిగిందని చూస్తే రన్నింగ్ లో ఉండగానే వెనక ఉండాల్సిన రెండు పక్కల టైర్లు ఊడిపోయాయి.

ఈ టైర్లు ఊడటంతో వెనక భాగం మొత్తం బస్సు నేలకు ఆనుకుంది.ఎవరు ఊహించని ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

తొర్రూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి తొర్రూర్ కు 40 మంది ప్రయాణీకులతో వెళ్తుంది.అయితే బస్సు రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిలో ఉండగా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి.

బస్సు నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరగలేదు.అదే బస్సు స్పీడ్ మీద ఉంటే పెను ప్రమాదం జరిగేదని చెబుతున్నారు.

గ్యారేజ్ లో బస్సు కండీషన్ చూడకుండానే సరిగా చెక్ చేయకుండా పంపిచినందుకే ఇలా జరిందని అంటున్నారు.ప్రయాణీకులు బస్ డిపో అధికారుల మీద మడిపడుతున్నారు.

డ్రైవర్, కండక్టర్ కూడా పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube