న్యూస్ రౌండప్ టాప్ 20

1.హీరో విశాల్ కు గాయాలు

  కోలీవుడ్ నటుడు హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న ఆయన గోడకు డీ కొట్టుకోవడం తో తీవ్ర గాయం అయింది.ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

2.గోవర్ధన్ ను పరామర్శించిన కవిత

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.ఇటీవలే ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణి శోభారాణి మరణించడంతో కవిత పరామర్శకు వెళ్లారు.
 

3.ఫీజులపై ఒత్తిడి తేవద్దు

  ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావద్దని ఏఐసీటీఈ విద్యాసంస్థలకు సూచించింది.
 

4.కేంద్ర ఉద్యోగాల్లో తెలుగు కు ప్రాధాన్యం ఇవ్వాలి

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థ లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని కోరారు.
 

5.ఏపీ హైకోర్టు లో ఉద్యోగాలు

  ఏపీ హైకోర్టు లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఆగస్టు 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
 

6.పోస్టాఫీసుల్లో మరిన్ని పౌర సేవలు

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  పోస్టాఫీసులలో మరిన్ని పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తపాలాశాఖ హైదరాబాద్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు.
 

7.జనావాసాల్లోకి వచ్చిన దుప్పి

  అడవిలో ఉండాల్సిన ఓ దుప్పి దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది.దుప్పిని చూసిన కుక్కలు దాన్ని వేటాడేందుకు ప్రయత్నించగా, శివాలయం లోకి ప్రవేశించింది.వెంటనే ఫారెస్ట్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ దుప్పి ని అడవిలో వదిలి పెట్టారు.ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పెనుమూరు లో చోటుచేసుకుంది.
 

8.పోలీసుల మధ్య సరిహద్దు వివాదం

  గుంటూరు జిల్లాలో పోలీసులు మధ్య సరిహద్దు వివాదం చెలరేగింది.పేకాట శిబిరంపై కేసు నమోదు పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.ప్రకాశం జిల్లా పరిధిలోని పేకాట శిబిరంపై గుంటూరు జిల్లా పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.ఈ కేసును ఎవరు దర్యాప్తు చేయాలని అంశంపై వివాదం నెలకొంది.
 

9.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

10.కస్తూర్బా ల్లో ప్రవేశాలకు గడువు పెంపు

  సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2021- 22 సంవత్సరానికి గాను 6,11 తరగతులు ప్రవేశాలకు 7,8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు ను పెంచినట్టు ఏపీ సమగ్ర శిక్ష ఎస్ పి డి కే వెట్ర సెల్వి తెలిపారు.
 

11.ఏ పార్టీకి అమ్ముడుపోను

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  తాను ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుబోనని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
 

12.గురుకుల సంస్థల కార్యదర్శిగా రోనాల్డ్ రోస్

  తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
 

13.క్లస్టర్ల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది.ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను గ్రామపంచాయతీలు,కాలనీలు, అయా ప్రాంతాల ప్రాతిపదికన క్లష్టర్ల వారీగా విభజించాలని జిల్లా కలెక్టర్లను మున్సిపల్ శాఖ ఆదేశించింది.
 

14.సినిమా థియేటర్లలో ఇక పార్కింగ్ ఫీజు

  సినిమా ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసేందుకు అనుమతి ఇస్తూ,  తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
 

15.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సోమవారం తిరుమల శ్రీవారిని 17,310 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

16.నౌకాయాన కేంద్రం వద్ద డ్రోన్ నిషేధం

  ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని సీబర్డ్ నౌకాయాన కేంద్రం చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేరకు నో ప్లై జోన్ గా ప్రకటించారు.
 

17.జమ్ము ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద మరో డ్రోన్

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగి నెల రోజులు తిరగకముందే మరో డ్రోన్ అక్కడ తిరగడం సంచలనం రేపుతోంది.ఈరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్ వారిలోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్ కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు.
 

18.ఢిల్లీ పర్యటనలో ఏపీ బీజేపీ చీఫ్

  ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ పర్యటనలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర శేకావత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులతో భేటీ కానున్నారు.
 

19.విశాఖ జిల్లా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

Telugu Ap Telangana, Arvind Kumar, Mlabaji, Secretaryronald, Somu Veerraju, Gold

  విశాఖ జిల్లా పెద్దపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,310   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,310

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube