నిందితుడి పెండ్లికి పోలీసులు.. అడ్డంగా బుక్క‌వ‌డంతో చివ‌ర‌కు..!

ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అద్భుతమైన మరుపురాని ఘట్టం పెళ్లి.ఈ వేడుకకు బంధుమిత్రులు అందరూ తప్పకుండా రావాలని వధూవరులు అనుకుంటారు.ఈ క్రమంలోనే అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తుంటారు.పోలీసు ఆఫీసర్లు, లాయర్లు, టీచర్లు అన్ని వర్గాలకు చెందిన వారికి శుభలేఖలు పంపిస్తారు.ఇక వారంతా వీలును బట్టి వివాహమహోత్సవానికి హాజరైతారు.అయితే, వీళ్లు మాత్రమే హాజరు కావాలనే రూల్ ఏం లేదు.

 Police Attends Accused Person's Marriage, Ig Action, Karnataka, Police Uniform,-TeluguStop.com

ఏ ప్రొఫెషన్‌కు చెందిన వారైనా పెళ్లికి హాజరుకావచ్చు.కానీ, కర్నాటకలో జరిగిన ఓ మ్యారేజ్‌కు హాజరై పోలీసు అధికారులు చిక్కులు తెచ్చుకున్నారు.అదేంటీ? పెళ్లికి హాజరైతే ఎవరైనా ఆనందిస్తారు.హాయిగా పెళ్లి భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్తారు.

కానీ, పోలీసు ఆఫీసర్లకు సమస్యలు రావడం ఏంటి? అనుకుంటున్నారా? అవునండీ.పోలీసులు పెళ్లికి హాజరైనందుకు వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

Telugu Ig, Karnataka, Attends, Officers, Unim-Latest News - Telugu

కర్నాటకలోని కనకగిరి తాలూకా హులిహైదర్‌ గ్రామానికి చెందిన హనుమంతేష్‌ నాయక్‌ కొడుకు ఆనంద్‌ ఓ కేసులో నిందితునిగా ఉన్నాడు.రీసెంట్‌గా అతడి మ్యారేజ్ జరిగింది.కాగా, ఆ వివాహమహోత్సవానికి గంగావతి ఏరియా పోలీసు ఆఫీసర్లు వెళ్లారు.

నూతన వధూవరులను ఆశీర్వదించి ఫొటో కూడా దిగారు.డ్యూటీ డ్రెస్‌లోనే వీరు వేడుకకు హాజరయ్యారు.

ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది.దాంతో వారు సదరు పోలీసు ఆఫీసర్లపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు.

గంగావతి ఏరియా పోలీసు ఆఫీసర్లు రుద్రష్‌ ఉజ్జినకొప్ప, ఉదయ్‌రవి, తారబాయ్‌పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.ఇలా చేయడం సరికాదంటూ ఐజీ, డీజీపీలు వారిని హెచ్చరించారు.

నిందితుడి పెళ్లికి వెళ్లడం ద్వారా సొసైటీకి తప్పుడు సంకేతాలిచ్చినట్లేనని చెప్పారు.వెంటనే లీవ్ పెట్టి వెళ్లాలని ఆ ముగ్గురిని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పోలీసు అధికారులు ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి పనులు చేయొద్దని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube