తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.లాక్ డౌన్ టైం ముగిసిన తర్వాత కూడా భక్తులు తిరుమల దర్శనానికి సుముఖత చూపలేదు.

 Tirumala Srivari Devotees Crowd Started At Tirupathi,latest News-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా కేసులు కంట్రోల్ అవడంతో మళ్లీ శ్రీవారి దర్శనానికి భక్తులు లైన్ కడుతున్నారు.తిరుమలలో మళ్లీ భక్తులతో పూర్వ వైభవం సంతరించుకుందని అంటున్నారు.

తిరుమల పరిసర ప్రాంతాలన్ని భక్తుల కోలాహలంతో కనిపిస్తున్నట్టు చెబుతున్నారు.

Telugu Tirumala, Tirupathi-General-Telugu

మండే రోజు 17,310 మంది దర్శకులు శ్రీవారిని దర్శించుకున్నారు.మంగళవారం 7,037 మంది భక్తులు తలనీలాలు ఇచ్చి తమ మొక్కు తీర్చుకున్నారని తెలుస్తుంది.మంగళవారం ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం 1.89 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.

తిరుమలలో మళ్లీ భక్తుల సందడి మొదలైంది.కరోనా వల్ల ఇన్నాళ్లు పరిమిత సంఖ్యలో దర్శనం టికెట్లు ఇవ్వగా ఇప్పుడు పెరుగుతున్న భక్తుల రద్దీని చూసి టికెట్లను పెంచుతున్నారు.

దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి వస్తారు.తెలుగు రెండు రాష్ట్రాల నుండి ప్రస్తుతం రద్దీ మొదలైందని తెలుస్తుంది.

 పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube