హుజురాబాద్ లో ' కారు ' ఓవర్ లోడ్ ?  అందరూ అభ్యర్థులే

హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ జోరు మీద ఉంది.పెద్దఎత్తున ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో సక్సెస్ అవుతోంది.

 Trs, Telangana, Congress, Hujurabad, Kcr, Koushik Reddy, Peddireddy, Praveen Kum-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టారు.వరుసగా ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.

పార్టీలోకి వచ్చే నాయకులందరికీ ఏదో ఒక పదవి హామీ ఇస్తున్నారు.వీరితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులను చేర్చుకునే విషయంలో స్పీడ్ పెంచారు.

ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకుంటూ వస్తుండడంతో టిఆర్ఎస్ లో చేరే వారు తమకే హుజురాబాద్ టికెట్ దక్కబోతోంది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.ఆ స్థాయిలో టిఆర్ఎస్ కూడా వారికి అవకాశం కల్పిస్తోంది.

ఇంత వరకు పార్టీ తరఫున ఎవరికీ టికెట్ ఫైనల్ కాకపోవడంతో , పార్టీలో చేరుతున్న కీలక నాయకులు అంతా తమ టికెట్ తమదేఅనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడిన పాడి కౌశిక్ రెడ్డి నేడు టిఆర్ఎస్ చేరబోతున్నారు.

Telugu Congress, Etela Rajender, Hareesh Rao, Hujurabad, Koushik Reddy, Peddi, P

ఇటీవలే ఆయన ఆడియో టేప్ బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది.దీంతో గత కొద్ది రోజులుగా ఆయన చేరిక వాయిదా పడింది.భారీ అనుచరగణం మధ్య ఈరోజు టిఆర్ఎస్ లో చేరబోతుతుండడం తో ఆయనకి టికెట్ దక్కాబోతోంది అనే ప్రచారం మొదలైంది.ఇంకా బీజేపీ నుంచి టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని చూస్తున్నారు.

అలాగే తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ కూడా టిఆర్ఎస్ తరఫున హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది.అలాగే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరిని టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడతారని ప్రచారం సాగుతోంది.

వీరే కాకుండా దాదాపు అరడజనుకు పైగా నేతలు తామే హుజురాబాద్ అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటూ ఉండడంతో ఈ వ్యవహారం టిఆర్ఎస్ కొంప ముంచుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు అని ,  అందులో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ ఫైనల్ చేసిన అభ్యర్థి ఓటమి కి పని చేస్తారేమో అన్న భయం టిఆర్ఎస్ లో నెలకొంది.

అయితే కేసీఆర్ మాత్రం ఇప్పుడు చేరిన నేతలు కాకుండా మరికొంత మంది కీలక నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకొని వారిలో ఒకరిని అభ్యర్ధిగా ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారట.అసంతృప్త నాయకులను ఏదో ఒకరకంగా బుజ్జగించవచ్చు అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube