భూముల ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణలో భూముల విలువ పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన భూముల ధరలు ఈ నెల 22 నుండి అమల్లో ఉంటాయని తెలుస్తుంది.

 Telangana Government Hikes Land Rates, Registrations, Land Rates,land Rates In-TeluguStop.com

తెలంగాణా ఏర్పడిన తర్వాత భూముల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నది ఇదే మొదటిసారి.తెలంగాణా ఏర్పడిన ఏడేళ్లలో ధరల సవరన చేపట్టారు.

బయట మార్కెట్ కు.ప్రభుత్వ ధరలకు తేడాని గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఈ భూముల ధరల సవరణ చేపట్టింది.22 తర్వాత కొత్త ధరలతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.అయితే ప్రభుత్వం భూముల ధరల పెంపు విషయం తెలుసుకున్న ప్రజలు రిజిస్ట్రేషన్లకు కొద్ది సమయమే ఉండటంతో రిజిస్ట్రేషన్లు, ఇతర కార్యకలాపాల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే పెంచిన భూముల ధరలతో తెలంగాణాలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం భూమి రేట్లను పెంచితే దానికి తగినట్టుగా బయట కూడా రేట్లను పెంచాలని చూస్తున్నారు.

ముఖ్యంగా చాలా స్థలాలు చేతుల మార్పిడిలో రేట్లలో తేడాలు వస్తున్నాయి.తెలంగాణాలో రియల్ భూమ్ ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది.

  పెరిగిన భూమి రేట్లతో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube