థియేటర్ లో పార్కింగ్ ఫీజుకి గ్రీన్ సిగ్నల్..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల మొన్నటి వరకు థియేటర్లు మూతపడ్డాయి.జూలై 23 నుండి తెలంగాణాలో థియేటలు తెరచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.ఈ క్రమంలో థియేటర్ల నష్టాలను పూడ్చేందుకు జీవో నెం.63ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2018 నుండి థియేటర్లో పార్కింగ్ ఫీజు వసూలు రద్దు చేస్తూ జీవో నెం 63 ని సవరించింది తెలంగాణ ప్రభుత్వం.అప్పటి నుండి థియేటర్లో పార్కింగ్ ఫీజులను వసూలు చేయట్లేదు.

 Telangana State Green Signal For Theater Parking Fees,telangana Govt, Theater Pa-TeluguStop.com

అయితే కరోనా వల్ల నష్టాల్లో ఉన్న థియేటర్లను ఆదుకునేందుకు జీవో ని రద్దు చేశారు.జూలై 23 నుండి తెరచుకునే థియేటర్లలో పార్కింగ్ ఫీజుని కూడా వసూలు చేస్తారని తెలుస్తుంది.

మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకు మాత్రం ఎప్పటిలానే పార్కింగ్ ఫీజుని వసూలు చేయకూడదని చెబుతునారు.వీటి కోసం మాత్రం గతంలో జారీ చేసిన ఉత్తర్వులే కొనసాగుతాయని చెబుతున్నారు.

థియేటర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలపడంతో పర్యవేక్షణ లేక శాంతిభద్రతలకు భంగం కలుగుతుంది.అందుకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవరిస్తూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా ఆర్డర్స్ పాస్ చేసింది.

 ఇక మీదట థియేటర్లలో పార్కింగ్ ఫీజ్ వసూలు చేయడం కామన్ అని తెలుస్తుంది.అయితే ఇవి కొనసాగిస్తారా లేక కొన్నాళ్లు మాత్రమే ఉంచుతారా అన్నది మాత్రం తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube