వామ్మో.. ఈ బుడ్డోడు ఇప్పుడే డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నాడే..!

డ్యాన్స్ చేయడం అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే.కానీ, అందరికీ ఈ కళ వచ్చి ఉండకపోవచ్చు.

 This Uncle Is Dancing Now , Children, Dance, Ias, Ias Officer  Avanish Sharana,-TeluguStop.com

సంప్రదాయ నృత్యాలు అయితే అంత ఈజీగా అబ్బే అవకాశముండదు.కొంచెం సమయం పడుతుంది.

ఇక పిల్లలయితే కొందరికి డ్యాన్స్ అంటే ప్రాణం.తమకు నచ్చిన వ్యక్తిని చూసి వారు చిన్న నాటి నుంచే డ్యాన్స్ పట్ల శ్రద్ధ వహిస్తుంటారు.

ఈ క్రమంలోనే రకరకాల స్టెప్పులు తమంతట తాముగానైనా లేదా ఎవరి సహకారంతోనైనా చేసే ప్రయత్నం చేస్తారు.అలా డ్యాన్స్ పట్ల పట్టు సాధిస్తారు.

అలా పట్టు సాధించిన ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.బుడ్డోడు డ్యాన్స్ చేసి రచ్చరచ్చ చేశాడనే కామెంట్లు వస్తున్నాయి.

ఇంతకీ ఆ బుడ్డోడు ఏ డ్యాన్స్ చేశాడంటే.

ఐఎఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ‘హ్యాండిల్ విత్ ద క్యాప్షన్’ అనే క్యాప్షన్ జత చేసి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.

బాలుడి డ్యాన్స్‌కు నెటిజనాలు ఫిదా అవుతున్నారు.బాలుడి డ్యాన్స్ వీడియోను రీ ట్వీట్ చేస్తూ లైక్స్, కామెంట్లు చేస్తున్నారు.బాలుడి ప్రతిభ సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికి తెలిసిపోయిందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.వీడియోను బట్టి బాలుడు వర్షం తగ్గాక డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

వాన వల్ల ఏర్పడ్డ బురద ఉన్న ప్రాంతంలో ఒక వ్యక్తి తీన్మార్ డప్పు కొడుతుంటే బీట్‌కు తగ్గట్లు ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు ఆ బుడ్డోడు.బాలుడు బీట్‌ను అనుసరిస్తూ స్టెప్స్ మారుస్తుండటం విశేషం.

ఇక ఇలాంటి డ్యాన్స్‌ను మీరు ఎప్పుడూ చూసి ఉండరనే ఐఎఎస్ ఆఫీసర్ పోస్ట్ పెట్టగా, నెటిజన్లు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.వీడియోలో ఉన్న మూడేళ్ల బాలుడు బురద నీటిలో కాళ్లకు చెప్పులు లేకుండా ఎంతో ఇష్టంగా డ్యాన్స్ చేస్తుండటాన్ని చూసి ప్రతీ ఒక్కరు ఆనందిస్తున్నారు.

బుడ్డోడు ప్రతిభావంతుడనే ప్రశంసలొస్తున్నాయి.వీడియోకు ఇప్పటికే మిలియన్ వ్యూస్ రాగా, ఇంకా వేలాది లైక్స్, రీ ట్వీట్స్ వస్తున్నాయి.

ఈ వీడియోను బట్టి టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదనే మాట మరోసారి నిరూపితమైందని పలువురు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube