అమెరికా: దలీప్ సింగ్ పోస్టాఫీసును సందర్శించిన భారత రాయబారి

అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా దలీప్ సింగ్ పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించారు.ఒక ఇండో అమెరికన్ పేరును అమెరికాలో పోస్టాఫీసుకు పెట్టడం ఆయనతోనే మొదలు.1956 నుంచి 1962 వరకు ప్రతినిధుల సభకు ఎన్నికైన దలీప్ సింగ్ పేరును కాలిఫోర్నియాలోని పోస్ట్‌ఆఫీసుకు పెట్టారు.అప్పటి అధ్యక్షుడు జార్జ్‌బుష్ సంతకం ద్వారా ఇందుకు సంబంధించిన బిల్లు జూలై 21, 2005న చట్టంగా మారింది.

 Indias Us Envoy Sandhu Visits Dalip Singh Saund Post Office In California, Dalip-TeluguStop.com

కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా సంధూ భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నేతలతో ముచ్చటించారు.అలాగే అమెరికా చట్టసభలో ఎనర్జీ, కామర్స్ కమిటీ సభ్యుడైన స్కాట్ పీటర్స్‌తో పాటు డారెల్ ఇస్సా, మైక్ లేవిన్‌తో తరంజిత్ భేటీ అయ్యారు.

దీనితో పాటు లాస్ ఏంజిల్స్, శాన్ డియాగోలను ఆయన సందర్శించారు.శాన్‌డియోగోలోని మారిటైమ్ మ్యూజియంలో వున్న చారిత్రాత్మక స్టార్ ఆఫ్ ఇండియా షిప్‌లో భారతీయ సమాజానికి చెందిన నేతలతో ముచ్చటించారు.1863లో నిర్మించిన స్టార్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతి పురాతనమైన సెయిలింగ్ షిప్.

ఈ సందర్భంగా కోవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభ సమయంలో భారత్‌కు మద్ధతు ఇవ్వడానికి అమెరికా ఎక్కువ ముందుకు వచ్చిందని తరంజిత్ సింగ్ అన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పాత్ర మరువలేనిదని ఆయన ప్రశంసించారు.

Telugu Calinia, Dalip Singh, Darrell Issa, Indianamerican, Indiasenvoy, Los Ange

కాగా, దలీప్ సింగ్ తర్వాత అమెరికాలోని ఓ పోస్టాఫీసుకు రెండోసారి భారతీయుడి పేరు పెట్టారు.ఆయనే ఇండో అమెరికన్ పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధలీవాల్.2019 సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న సందీప్ సింగ్‌ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్టాఫీస్ భవనం’గా పేరు మార్చి ఆయనను గౌరవించాలని అమెరికా భావించింది.

అందుకు సంబంధించిన బిల్లుపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube