ఈ ఆలయంలో చేపలే నైవేద్యం.. ఎక్కడంటే?

ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ భారత భూమిలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఇన్ని ఆలయాలలో ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకతను, విశిష్టతను, వింతలను కలిగి ఉంది.

 Interesting Facts About Gumpa Sangameshwara Swamy Temple , Gumpa Sangameshwara S-TeluguStop.com

అయితే సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి నైవేద్యంగా వివిధ రకాల పండ్లు, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం మనం చూస్తుంటాం.అయితే స్వామివారికి నైవేద్యంగా మాంసాన్ని సమర్పించడం పురాణాలలో భక్త కన్నప్ప ఆ పరమేశ్వరుడికి మాంసం నైవేద్యంగా పెట్టడం అనేది వినే ఉంటాం.

అయితే పరమేశ్వరుడికి భక్తకన్నప్ప ఏ విధంగా అయితే మాంసాన్ని నైవేద్యంగా పెట్టారో ఇప్పటికీ ఈ పరమేశ్వరుడి ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

భక్తులు భక్తితో ఏ నైవేద్యాన్ని సమర్పించిన వారి భక్తి భావానికి లొంగే పరమేశ్వరుడు భక్త కన్నప్ప సమర్పించిన మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా స్వీకరించారనే విషయం మనకు తెలిసిందే.అచ్చం ఇలాగే విజయనగరం జిల్లా కొమరాడు మండలం గుంప సంగమేశ్వర ఆలయంలోని స్వామివారికి భక్తులు నైవేద్యంగా చేపలను వండి, చేపల కూరను నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు.

ఈ గ్రామంలో శివరాత్రి రోజున గ్రామస్తులు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.

Telugu Baksha Kanappa, Fish Offered, Indian Temples, Shiva Temple, Srikalahasti,

శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు స్వామివారికి వివిధ రకాల పనులతోపాటు చేపల కూర కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ విధంగా స్వామివారికి చేపల కూరను సమర్పించడం వల్ల వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.ఈ విధంగా స్వామివారికి చేపలను నైవేద్యంగా పెట్టడం కొన్ని దశాబ్దాల నుంచి ఒక ఆచారంగా వస్తోందని, ఇదే ఆచారాన్ని ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు పాటిస్తూ ఉన్నారు.ఈ విధంగా చేపల కూర నైవేద్యంగా స్వీకరిస్తూ గుంప సంగమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube