మిస్ ఇండియా యూఎస్ఏ 2021 విజేత వైదేహీ డోంగ్రే..!!!

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో మిచిగాన్‌కు చెందిన భారత సంతతి యువతి విజేతగా నిలిచారు.25 ఏళ్ల వైదేహి డోంగ్రే.మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.1997లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన డయానా హేడెన్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా మిస్ ఇండియా యూఎస్ఏ 2021లో వైదేహీ డోంగ్రే విజేతగా నిలిచినట్టు డయానా హేడెన్ ప్రకటించారు.జార్జియాకు చెందిన అర్షి లలాని.ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా నిలిచారు.యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వైదేహీ డోంగ్రే.

 Vaidehi Dongre Crowned Miss India Usa, Arshi Lalani Becomes The First Runner-up,-TeluguStop.com

ప్రస్తుతం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్‌లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ఆమెకు ‘‘మిస్ టాలెంటెడ్’’ అవార్డు కూడా వరించింది.

ఇక మిస్ ఇండియా యూఎస్ఏ 2021గా నిలవడం పట్ల వైదేహి హర్షం వ్యక్తం చేశారు.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం మరియు అక్షరాస్యత కోసం కృషి చేయనున్నట్టు వెల్లడించారు.

కాగా, ఇదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన 20 ఏళ్ల లలాని తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో అందరినీ అబ్బురపరిచారు.బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నప్పటికీ చివరి వరకు విజేతగా నిలిచేందుకు పోరాడారు.

నార్త్ కరోలినాకు చెందిన మీరా కసరిని ఈ పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా ప్రకటించారు.

Telugu Arshi Lalani, Brain Tumor, Diana Hayden, Lalani, India Usa, Teen India Us

మిస్ ఇండియా యూఎస్ఏ, మిసెస్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ అనే మూడు వేర్వేరు పోటీలకు సంబంధించి 30 రాష్ట్రాల నుంచి 61 మంది పోటీదారులు పాల్గొన్నారు.మూడు విభాగాల్లో విజేతలు ముంబైలో జరిగే ప్రపంచస్థాయి పోటీలలో పాల్గొనేందుకు కాంప్లిమెంటరీ టికెట్లను పొందుతారు.న్యూయార్క్‌కు చెందిన ధర్మాత్మ, నీలం శరణ్ 1980లో ప్రారంభించిన మిస్ ఇండియా యూఎస్ఏ కార్యక్రమం భారతదేశం వెలుపల సుదీర్ఘంగా నడుస్తున్న ఈవెంట్ కావడం విశేషం.

ఈ కార్యక్రమంలో 40 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది.ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతూ వస్తోంది.గతేడాది ఫ్లోరిడాకు చెందిన ఐశ్వర్య గులానీ మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube