కేసిఆర్ దళిత బంధు పథకం పై విజయశాంతి సెటైర్లు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల “దళిత బంధు” అనే పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నట్లు కేసిఆర్ తెలపడం జరిగింది.

 Vijayashanthi Sensational Comments On Kcr Dalita Bhandu Scheme, Vijayshanthi, Kc-TeluguStop.com

ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ నాయకురాలు విజయశాంతి. కేసీఆర్ “దళిత బంధు” పథకం పై సెటైర్లు వేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలవడం కోసం కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ అని అన్నారు.

అప్పట్లో దళితులకు మూడెకరాల భూమి తెలంగాణ ఏర్పడితే మొట్ట మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ హామీలు ఇచ్చారు… ఆ హామీలు ఏమయ్యాయో ఈ పథకం కూడా అదేరీతిలో నీరుగారి పోతుందని.

ఈ పథకం అమలు కావాలంటే దాదాపు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని, అంత డబ్బు రాష్ట్రప్రభుత్వం దగ్గర ఉందా అంటూ విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు.ప్రజలందరికీ అర్థమవుతుందని కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికలలో గెలవడం కోసం.

ఈ పథకాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చినట్లు.ఒకవేళ ఈ పథకాన్ని విపక్షాలు న్యాయస్థానాలు అడ్డుకుంటే.

Telugu Huzurabad, Kcrdalita, Kcr, Kcr Schemes, Telangana Bjp, Vijayshanthi-Polit

దళితుల అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనే పొలిటికల్ మైలేజ్ కూడా సంపాదించే అవకాశం కూడా ఉంది అని విజయశాంతి తెలిపారు. 

కేసీఆర్ ప్రకటన చూస్తే తెలంగాణ అంటే కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నట్టుగా ఉంది అని.అన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇరవై వేలకు పైగా దళిత కుటుంబాలు ఉండటంతో ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు అన్న ఉద్దేశంతో విజయశాంతి తనదైన శైలిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube