భారతీయులకు షాక్: కెనడా వెళ్లాలంటే కొంతకాలం ఆగాల్సిందే...!!

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్‌తో మొదలైన ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

 Covid-19: Canada Extends Ban On Direct Flights From India Until August 21, Scott-TeluguStop.com

కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు నిబంధనలను అతిక్రమించి స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.ఈ తర్వాత దీనిని ఎత్తివేశారనుకోండి.

అది వేరే విషయం ఇక భారతీయులు అమెరికా తర్వాత పెద్ద సంఖ్యలో వలస వెళ్లే కెనడా కూడా మనదేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం డెల్టా వెరియేంట్ దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది.

తొలుత ఏప్రిల్‌‌లో మొదలైన ఈ నిషేధాజ్ఞల గడువు జులై 21తో ముగియనుంది.ప్రస్తుతం భారత్‌లో కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్‌ ఆందోళనకరంగానే ఉండటంతో విమానాలపై నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

Telugu Australia, Canada, Covidcanada, Delta, Fine Rs, Transportomar, Scott Morr

ఆగస్టు 21 వరకు భారత్‌ నుంచి నేరుగా ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని ఆ దేశ రవాణా మంత్రి ఒమర్‌ అల్‌ఘబ్రా ప్రకటించారు.కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత్‌లో పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నాయని.డెల్టా వేరియంట్‌ నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు మరో మార్గం లేదని ఒమర్‌ అన్నారు.ఆంక్షలు విధించినప్పటికీ కెనడా భారతీయులకు చిన్న వెసులుబాటు కల్పించింది.అదేంటంటే.‘థర్డ్‌ కంట్రీ’ ద్వారా భారత్‌ నుంచి ప్రయాణికులు కెనడా రావొచ్చని తెలిపింది.

ఇందుకోసం ప్రయాణికులు మరో దేశంలో దిగి అక్కడ కరోనా టెస్టులు చేయించుకోవాలి.అనంతరం అక్కడే రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.

ఆ తర్వాత కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌తో కెనడాకు రావొచ్చని వెల్లడించింది.

అయితే విమానాలపై నిషేధం రద్దు చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు ఒట్టావాలోని భారత హైకమీషన్ .ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఓ లేఖ పంపిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube