బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చింది.. ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటంటే?

మన భారతదేశంలో ఎన్నో కుల మతాలకు నిలయం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క మతస్తులు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను జరుపుకుంటారు.

 When Did The Festival Of Bakrid Come .. What Is The Significance Of This Festiva-TeluguStop.com

ఈ క్రమంలోనే ముస్లిం మతస్తులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్.ఈ పండుగనే ఈద్-ఉల్-అధా అని కూడా పిలుస్తారు.

బక్రీద్ పండుగ అంటేనే త్యాగానికి ప్రతీకగా ముస్లిం మతస్తులు భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో, దాన ధర్మాలతో ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఈ ఏడాది బక్రీద్ పండుగ 2021 జూలై 21 బుధవారం దేశ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ప్రతి ఏటా బక్రీద్ పండుగ ముస్లిం మతస్థులు ఇస్లామిక్ పవిత్ర తీర్థయాత్ర లేదా హజ్ నెల చివరిలో జరుపుకుంటారు.బక్రీద్ పండుగ రోజు ముస్లిం మతస్తులు గొర్రె లేదా మేకను బలి ఇచ్చి వాటిని మూడు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని ఇతరులకు దానం చేయడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

దేవుడి ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రహీం సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడి ఆత్మ ప్రకారం తన బలికి బదులుగా, గొర్రెలను బలి ఇవ్వమని చెప్పడంతో, ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున గొర్రె లేదా మేకను బలి ఇస్తారు.

Telugu Bakrid, Goat, India, India Wise, July, Muslims, Muslims Holly, Pray God,

ఈ విధంగా ముస్లిం ప్రజలందరూ ఈ పండుగ రోజు కొత్త బట్టలను ధరించి మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.అదేవిధంగా తమ బంధువులకు సన్నిహితులకు కానుకలను ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ప్రార్థనలో పాల్గొని, ప్రార్థనల అనంతరం పేదవారికి వారి సాయ శక్తుల దానధర్మాలు చేస్తారు.

ఈ విధంగా రోజంతా ఎంతో సంతోషంతో, విందు వినోదాలలో పాల్గొంటూ బక్రీద్ వేడుకలను జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube