ఇదేందయ్యా ఇది: ముందు తేలు, వెనక చూస్తే సాలీడు..!

ఈ ప్రపంచంలో చాలా జంతువులు ఉంటాయి.మానవ జీవచరాలు అనేకం తమ ప్రయాణాన్ని భూమిపై సాగిస్తుంటాయి.

 Is This It: A Scorpion In Front, A Spider In The Back  Spider, Scorpion, Mix, Bu-TeluguStop.com

అందులో కొన్ని హానికరమైనవి ఉంటాయి.మరికొన్ని మంచివి చేసేవి ఉంటాయి.

అయితే ఇప్పుడు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం.కొన్ని జంతువులు రెండు రకాల జంతువుల పోలికలు కలిగి ఉంటాయి.

అలాంటి కోవకు చెందిందే ఓ రాకాసి పురుగు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రాకాసి పురుగు ఫోటో తెగ వైరల్ అవుతోంది.

చూసేందుకు ఆ రాకాసి పురుగు అనేది సగం తేలులా ఉంది.ఆ మిగిలిన సగం సాలీడులాగా ఉండటం ప్రస్తుతం అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఆ పురుగుకు ముందు భాగంలో తేలు మాదిరిగాను వెనక భాగంలో సాలీడులాగా ఉంది.ఇటువంటి వింత అయిన పురుగు ఫొటోను యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ పార్క్ సర్వీస్ అనేది నెట్టింట పోస్టు చేసింది.

దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇటువంటి వింతగా ఉండే పురుగు పేరు వినేగారూన్ లేదా విప్ స్కార్పియోన్ అని పిలుస్తున్నారు.

థెలిఫోనిడా అరాక్నిడ్స్ ఉప జాతికి ఈ వింత పురుగు చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ రకానికి చెందిన పురుగులలో వంద జాతులు అనేవి ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు.

విప్ స్కార్పియన్ అనేది తేళ్ళను పోలి ఉండే ఓ జీవి.ఈ జంతువులకు తోక అనేది కచ్చితంగా ఉంటుంది.

మామూలుగా ఈ రకానికి చెందిన పురుగు మూడు అంగుళాల వరకు ఉంటుంది.

Telugu Spider, Park, Latest-Latest News - Telugu

వాటిని ఏమీ అనకపోతే అవి మనల్ని ఏం చేయవు.ఇవి వేటికీ హాని అనేది చేయవు.అయితే దానిని మనం ఏదైనా చేసినట్లైతే అవి దాడి చేస్తాయి.

85 శాతం ఆ పురుగులు తమకు ఇబ్బంది కలిగించే వాటిని ఏదో ఒకటి చేసే వరకూ ఊరుకోవు.ఇటువంటి వింతగా ఉండే పురుగులు బొరియల్లో బతుకుతుంటాయి.

కేవలం ఆహారం కోసమే అవి బయటకు వస్తాయని, అవి మిల్లిపెడ్స్, చిన్న తేళ్లు, క్రికెట్స్, బొద్దింకలను ఆహారంగా తీసుకుంటాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ పురుగు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube