గూగుల్ క్రోమ్ ను తెగ వాడేస్తున్నారా..? అయితే మీ డేటా చోరీ కాకుండా ఇలా జాగ్రత్త పడండి..!

నేటి రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గూగుల్ క్రోమ్ ను వినియోగిస్తున్నారు.ఇంటర్నెట్ లో మొజిల్లా, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటివి ఎన్నో రకాల బ్రౌజర్లు ఉన్నప్పటికీ కూడా చాలా మంది గూగుల్ క్రోమ్ నే వినియోగిస్తున్నారు.

 Alert, Google Chrome, User, Update Browser, Hackers, Data Safe, Technology Updat-TeluguStop.com

యూజర్లను ఆకట్టుకోవడానికి గూగుల్ క్రోమ్ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.గూగుల్ క్రోమ్ అనేది అత్యంత వేగంతో పాటుగా మంచి మంచి ఫీచర్లను కూడా ప్రజలకు చేరువచేసింది.

అటువంటి గూగుల్ క్రోమ్‌ కూడా తాజా ఓ లోపం అనేది ఉన్నట్లు గుర్తించారు.ఆ లోపం వలన చాలా మంది ఆన్ లైన్ దొంగలు అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలనేవి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలోని ఇన్ఫర్మేషన్ ను దొంగతనం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ విషయాన్ని గూగుల్ సంస్థే అందరికీ తెలియజేసింది.

Telugu Google Chrome, Hackers, Ups, Browser, User-Latest News - Telugu

ఆ తర్వాత ఆ నేరాన్ని జరగకుండా చేసేటటువంటి విషయాన్ని కూడా గూగుల్ తెలియజేసింది.ముందుగా వినియోగదారులు తమ డివైజ్‌లలో క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలి.ఆ తర్వాత లేటెస్ట్ వెర్షన్ ఇన్ స్టాల్ చేయాలి.

దీంతో నేరాలను జరగకుండా చేయొచ్చని గూగుల్ తమ వినియోగదారులకు తెలియజేసింది.ఇటువంటి సెక్యూరిటీ లోపం ఉండటం వలన హ్యాకర్లు డివైజ్ లను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.

అంతేకాదు ప్రజల డేటాను వారు తష్కరించే ప్రమాదం ఉంది.దీనినే ఇప్పుడు గూగుల్ సవరించింది.

వినియోగదారులు వీలైనంత త్వరగా తమ యాప్ ను లేదా బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.గూగుల్ తన తప్పును గుర్తించేలోపే చాలా మంది వినియోగదారుల సమాచారాన్ని హ్యాకర్లు డార్క్ వెబ్ కి అమ్మినట్లు తెలుస్తోందని, వెంటనే పాత వెర్షన్‌లో ఉన్నవారందరూ అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ క్రోమ్ తమ వినియోగదారులకు సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube