బీజేపీ ని భయపెడుతున్న రేవంత్ ? ఎంతగా అంటే..?

కొత్తగా పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకురావడంతో పాటు , తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు అనే లెక్కలు వేసుకుని ఇతర పార్టీలో చేరిన వారు, తటస్థంగా ఉన్న నేతలను గుర్తించి కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా ఆయన ముందుకు వెళుతున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలు బయట పెడుతూ ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకున్నారు పనిలో పనిగా బీజేపీని ఆయన విమర్శిస్తూ తెలంగాణలో తన పట్టు పెరిగే విధంగా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు.అయితే రేవంత్ రాజకీయంగా ముందుకు వెళ్తున్న తీరు తెలంగాణ బిజెపి నేతల్లో కలవరం పుట్టిస్తోంది.

 Bjp, Revanth Reddy, Trs, Tdp, Chandrababu, Devendhar Goud, Telangana, Erra Shekh-TeluguStop.com

పైకి టిఆర్ఎస్ ను ఎక్కువగా విమర్శిస్తునట్లు ,ఆ పార్టీ ని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నా, రేవంత్ కారణంగా తామే ఎక్కువగా నష్టపోతున్నామనేది బిజెపి అంచనా.ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి బీజేపీలో చేరిన నేతలను ఎక్కువగా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు.

స్వయంగా సదరు నేతల ఇళ్లకు వెళ్లి మరి రేవంత్ మంతనాలు చేస్తూ, కాంగ్రెస్ లో చేరవలసిందిగా వారిని కోరుతున్నారు.ఇప్పటివరకు టిఆర్ఎస్ కూడా చేర్చుకునేందుకు ప్రయత్నించని నేతల పైన రేవంత్ దృష్టి సారించారు.

అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో తనతో పాటు కలిసి పనిచేసి,  ఆ తర్వాత బిజెపిలో చేరిన నేతలను ఎక్కువగా కలుస్తుండడం బిజెపి కి ఆందోళన పెంచుతోంది.బిజెపి మహబూూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్రా రాజశేఖర్ రాజీనామా చేశారు.

అలాగే భూపాలపల్లి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రేవంత్ తో భేటీ అయ్యారు.

Telugu Chandrababu, Devendhar Goud, Erra Shekhar, Revanth Reddy, Telangana-Telug

అలాగే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో రేవంత్ భేటీ అయ్యారు.అలాగే 2 రోజుల క్రితం మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ,ఆయన కుమారుడు బీజేపీ నేత వీరేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి మంతనాలు చేయడం తదితర పరిణామాలు బిజెపిలో ఆందోళన పెంచుతున్నాయి.రేవంత్ పూర్తిగా బిజెపిని టార్గెట్ చేసుకున్నారని, బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెంచి ఆ తర్వాత టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటారని, బీజేపీ మరింత బలహీనం అవుతుందనే ఆందోళన ఆ పార్టీ ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube