అలరించిన “పాఠశాల” మొదటి వార్షికోత్సవం..!!

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా).ఎనో ఏళ్ళుగా అక్కడి తెలుగు వారికి అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేస్తూ, తెలుగు వెలుగులు ప్రసరింపజేస్తున్న తానా ప్రవాసుల పిల్లలకు తెలుగు నేర్పేందుకు “పాఠశాల” ను ఏర్పాటు చేసింది.

 Tana Paatasala Program Completes First Anniversary, Tana, Paatasala Program, Tan-TeluguStop.com

పిల్లలకు తెలుగుపై మక్కువ ఏర్పడేలా, తెలుగు బాషను గౌరవించుకునేలా పాటశాల ఇచ్చే తర్ఫీదు ఎంతో రమణీయంగా ఉంటుంది.తాజాగా పాటశాల నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అందరిని అలరించింది.

అంతర్జాలం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ సమావేశంలో తానా కార్యవర్గ సభ్యులు, పాటశాల ఉపాధ్యాయులు , విద్యార్ధులు పాల్గొన్నారు.గణపతి ప్రార్ధనతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రవి పోచి రాజు నీటి కధలు పిల్లలకు చెప్పగా, బుర్ర సత్య పాటశాల పాటాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు క్విజ్ పోటీలు నిర్వహించారు.మరి కొందరు శ్లోకాలను చెప్పగా, మరికొందరు నీటి శతకాలు చెప్పారు.ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగిన కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

Telugu Tana, Tanapaatasala, Tanalavu, Telugu Language, Telugu Nris-Telugu NRI

తానా చైర్మెన్ లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు బాషపై అభిమానంతో స్వచ్చందంగా పాటశాలలో తెలుగు భోధన చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.తానా మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ ఇచ్చిన కోటిన్నర విరాళానికి వారి కుటుంభ సభ్యులకు అంజయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.ఇదిలాఉంటే తానా నిర్వహిస్తున్న పాఠశాల కార్యక్రమానికి “బాటా” ( బే ఏరియా తెలుగు అసోసియేషన్) సహకరిస్తుందని ప్రకటించారు.

చివరిగా పాటశాల చైర్మెన్ నాగరాజు పిల్లల తల్లితండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube