అమెరికా మొత్తం ఆమె గూర్చే చర్చ...హిస్టరీ క్రియేట్ చేసిందిగా...!!!

అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ మహిళ రికార్డ్ సృష్టించింది.అలా ఇలా కాదు, భవిష్యత్తు తరాలకు స్పూర్తి నింపేలా ఆమె తెగువ, ధైర్యం యావత్ అమెరికా యువతులకు మార్గ దర్సం అయ్యాయి.

 Sailor Becomes First Woman To Complete Navy Special Warfare, Sailor, America Nav-TeluguStop.com

ఇంతకీ మహిళ ఎవరు, ఆమె చేసిన పని ఏంటి అంటే.అమెరికా నేవీ ఉద్యోగం సాధించాలంటే అంత సులువు కాదు.

కటోరమైన శిక్షణ పూర్తి చేసుకోవాలని, పురుషులు తప్ప స్త్రీలు ఎప్పుడూ నేవీ ఉద్యోగాలకోసం పోటీ పడిన దాఖలాలు లేవు.అమెరికా నేవీ నిర్ణయం ప్రకారం 2016 లో నేవీ అమెరికాలో మహిళలను కూడా ఉద్యోగాలలో తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.దాంతో

అప్పటి నుంచీ ఎంతో మంది మహిళలు ఉద్యోగాలకు పోటీ పడ్డారు కానీ నేవీ ఇచ్చే కటినమైన శిక్ష ముందు విజయం సాధించలేక పోయారు.కానీ అమెరికా చరిత్రలో తనకంటూ ఓ పేజీ ఉండాలని భావించిన ఓ మహిళ మాత్రం కటినమైన శిక్షణ పూర్తి చేసుకోవాడానికి సిద్దమయ్యింది.

అమెరికా నేవీలో ఉద్యోగ శిక్ష అంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి.దాదాపు 9 నెలలపాటు కటోరమైన శిక్షణ ఉంటుంది.అత్యాధునిక ఆయుధాలు ఎలా వాడాలి, ఎత్తైన ప్రదేశాల నుంచీ సముద్రంలోకి దూకడం స్పీడ్ బోటింగ్ , వేగంగా వెళ్ళే బోటు లోంచి సముద్రంలోకి దూకడం టార్గెట్ రీచ్ అవ్వడం, ఆక్సిజన్ లేకుండా సముద్రపు అంచుల వరకూ వెళ్లి రావడం ఉంటుంది.ఇక చివరి శిక్షణలో భాగంగా 72 గంటలపాటు సాహసవంతమైన ఫైనల్ టెస్ట్ ఉంటుందని అందులో విజయం సాదిస్తే సెయిలర్ గా ఉద్యోగం సాధించినట్టే.అయితే

Telugu America Navy, Sailor, Navy Warfare, Sailorcomplete, Navys-Telugu NRI

ఈ క్రమంలోనే స్పెషల్ వార్ ఫేర్ లో సెయిలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడటంతో ఆమెతో పాటు సుమారు 18 మంది మహిళలు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.కానీ శిక్షణ సమయంలో అందులో చాలామంది తమవల్ల కాదని బయటకు వెళ్ళిపోగా కేవలం నలుగురు మహిళలు మాత్రమే చివరి వరకూ నిలిచారు.అయితే అందులో ఒక మహిళ మాత్రమే తాజాగా ఈ శిక్షణ పూర్తి చేసుకుని సెయిలర్ గా ఉద్యోగ భాద్యతలు చేపట్టారు.మిగిలిన వారు ఇంకా శిక్షణలోనే ఉన్నారని తెలుస్తోంది.

అమెరికా నేవీ చరిత్రలో మొట్టమొదటి మహిళ సెయిలర్ గా ఆమె పదవీ భాద్యతలు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని, ఆమెను స్పూర్తిగా తీసుకుని మరింత మంది మహిళలు ముందుకు రావాలని నేవీ అధికారులు కోరారు.ఇదిలాఉంటే శిక్షణ పూర్తి చేసుకుని ఎంపిక అయిన వారి వివరాలు అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube