డేంజర్: ఆ సరస్సులో నీరు తాగితే ఏకంగా కాటికే వెళ్లడమే..!

ప్రకృతి ఎంతో అందమైనది.ఎన్నో చిత్ర విచిత్రమైన అందాలు మనకు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి.

 A Mysterious Lake In The World, After Which No One Survives After Drinking Water-TeluguStop.com

ఆ అందాలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.ఒకసారి చూస్తే చాలు మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి.

కానీ ఈ ప్రకృతిలో మనకి తెలియని కొన్ని రహస్యాలతో పాటు, కొన్ని వింతలు కూడా ఉన్నాయి.అయితే ఈరోజు అలాంటి ఒక ప్రకృతి సిద్దమైన, అందంగా, ఆహ్లాదకరంగా ఉండే ఒక సరస్సు గురించిన కొన్ని రహస్యాలు తెలుసుకుందాం.

ఈ సరస్సు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.సరస్సులోని నీరు కూడా తెల్లగా శుభ్రంగా ఉంటాయి.

కానీ.ఈ సరస్సుని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు అని అంటారు ఆ దేశస్థులు.

ఎందుకంటే ఈ సరస్సులోని నీటిని ఎవరయినా తాగితే వాళ్ళు కొద్ది రోజుల్లోనే చనిపోతారు.అసలు ఇంతకీ ఆ సరస్సు ఎక్కడ ఉంది.

ఆ సరస్సులో నీటిని తాగితే ప్రాణాలు ఎందుకు పోతాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అత్యంత ప్రమాదకరమైన ఈ సరస్సు దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌ లో ఉంది.

అలాగే ఈ సరసుకు ఇంకో పేరు కూడా ఉంది.దీనిని ఫుండుజీ సరస్సు అని కూడా పిలుస్తారు.

ఈ సరసుకి ఒక చరిత్ర ఉంది తెలుసా.అక్కడ స్థానిక ప్రజల చెప్పే కధనం ప్రకారం పురాతన కాలంలో ఎక్కడి నుంచో ఒక కుష్టి రోగి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈ సరసు ఉన్నా ఊరిలోకి వచ్చాడట.

అతన్ని చూసి అక్కడ ప్రజలు అతడికి తినడానికి ఆహారం గాని, ఉండడానికి ఆశ్రయం గాని ఇవ్వలేదట.దీంతో ఆ కుష్టి రోగి అక్కడ ప్రజలను శపించి సరస్సులోకి దూకి అదృశ్యమయ్యాడని వాళ్ళ పూర్వీకుల చెబుతూ ఉండేవారట.

ఈ నది నీరు చాలా శుభ్రంగా ఉంటాయి.కానీ ఎవరైనా తాగారంటే కొద్దికాలానికే చనిపోతారు.

Telugu Lake, Danger Lake, Lake Sa, Limpopoprovince, Lake Africa, Latest-Latest N

అసలు ఈ నీటిలో ఏముంది అనే రహస్యాన్ని కనుగొనుటకు 1946 లో ఆండీ లెవిన్ అనే వ్యక్తి ఇక్కడకు వచ్చాడు.అప్పుడు అతను ఈ సరస్సులో ఉన్న నీటిని కొద్దిగా తీసుకుని, సరస్సు చుట్టూ ఉన్న కొన్ని మొక్కలను కూడా పరిశోధనకు గాని తీసుకొని వెళ్లాడట.కానీ అతను కొంత దూరం వెళ్ళాక దారి తప్పి సరసు నుంచి తెచ్చిన నీళ్ళు, మొక్కలను విసిరి పారేసేవరకు అక్కడక్కడే తిరిగాడట.ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత లెవిన్ మరణించాడు.

అప్పటి నుంచి ఈ సరస్సు గురించి తెలుసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు.ఈ సరస్సులో ఏవో ప్రమాదకర వాయువులు ఉన్నాయి అంటున్నారు గాని వాటికి సంబందించిన ఎటువంటి ఆధారాలు అయితే లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube