టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత అభిరుచులు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్స్ లో పాల్గొనే హీరోయిన్లు చాలామంది ఉన్నారు.అయితే ఈ హీరోయిన్లకు ఏ కారణం చేతనైనా గ్యాప్ వస్తే వాళ్ల వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తారు.

 Tollywood Star Heroines Personal Hobbies Details, Rashi Kanna, Samantha, Pooja-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు గిటార్ ప్లే చేయడం హాబీ.ఈ మధ్య కాలంలోనే రాశిఖన్నా గిటార్ ప్లే చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు.

మరో హీరోయిన్ పాయల్ కు నచ్చిన వంటకాలను చేసి వాటిని రుచి చూడటం హాబీగా ఉంది.

స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుకు గార్డెనింగ్ హాబీ కాగా పూజా హెగ్డేకు బీచ్ కు వెళ్లడం వ్యక్తిగత అభిరుచిగా ఉంది.

టెర్రస్ గార్డెనింగ్ ను పూజా హెగ్డే ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కు పెయింటింగ్ వేయడం హాబీ కాగా తన పెయింటింగ్స్ ను ఎగ్జిబిషన్ పెట్టాలని ఆమె భావిస్తున్నారు.

మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.

Telugu Personal, Rakul, Rashikhanna, Tollywood-Movie

కార్లు సేకరించడం కూడా నివేదా పేతురాజ్ హాబీ కావడం గమనార్హం.టాలెంట్ ఉన్న నటి అయినప్పటికీ నివేదా తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేదు.మరో హీరోయిన్ నభా నటేష్ కు కూడా పెయింటింగ్ హాబీ కావడం గమనార్హం.

షూటింగ్ కు గ్యాప్ వస్తే బ్రష్ పట్టుకుని నభా నటేష్ ఇష్టమైన పెయింటింగ్స్ వేస్తారు.స్టార్ హీరోయిన్ తమన్నాకు ఆభరణాలు కొనడం హాబీగా ఉంది.

Telugu Personal, Rakul, Rashikhanna, Tollywood-Movie

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు బుక్స్ చదవడం హాబీగా ఉంది.పెద్దపెద్ద నవలలను కూడా సులువుగా చదవగల టాలెంట్ కాజల్ సొంతం.మరో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు గార్డెనింగ్ హాబీ కాగా పూలమొక్కలను కూరగాయల మొక్కలను ఈమె ఇష్టంగా పెంచుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube