హుజూరాబాద్ టీఆర్ ఎస్ క్యాండిడేట్ ఆయ‌నేనా.. అందుకే ఐపీఎస్‌ ప‌ద‌వికి రాజీనామా..?

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు చోటుచేసుకుంటున్నాయి.ఇప్ప‌టికే ఈట‌ల రాజీనామా, రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కావ‌డం, ఆ త‌ర్వాత ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌టించ‌డం ఇలా వ‌రుస బెట్టి అనూహ్య ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి.

 Is He A Huzurabad Trs Candidate Hence The Resignation Of Ips Officer , Rs Pravee-TeluguStop.com

ఇక ఇప్ప‌డు ఇవ‌న్నీ కాస్త సైడ్‌కు వెళ్లి హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశ‌మే మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది.ఇప్పుడు ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించే క్యాండిడేట్ కోసం టీఆర్ ఎస్ మొద‌టి నుంచి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

అయినా అభ్య‌ర్థి లేకున్నా కూడా ప్ర‌చారాన్ని మొత్తం హరీశ్‌రావు ద‌గ్గ‌రుండి నడిపిస్తున్నారు.

అయితే మొద‌టి నుంచి చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చినా కూడా వారెవ‌రినీ కేసీఆర్ ఫైన‌ల్ చేయ‌లేదు.

అనేక స‌ర్వేలు, అనేక అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు.ఇక రీసెంట్ గా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని చూసిన కౌశిక్ రెడ్డికి టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చి నిల‌బెడుతార‌నే ప్ర‌చారం కూడా సాగినా కూడా దానిపై ఇంకా స‌మాచారం లేదు.

ఇక ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ‌లోనే అత్యంత ఇమేజ్ ఉన్న మ‌రో కీల‌క అధికారి పేరు తెర‌మీద‌కు రావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

Telugu Eetela Rajendra, Ips, Huzurabadtrs-Telugu Political News

ఆ ఇమేజ్ ఉన్న ఆఫీస‌ర్ ఎవ‌రో కాదు తెలంగాణ గురుకులాల కార్య‌ద‌ర్శి, ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ సృష్టిక‌ర్త అయిన ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్‌.26 ఏండ్ల పాటు ఐపీఎస్‌గా సేవ‌లు అందించిన ప్ర‌వీణ్ కుమార్ ఈరోజు(సోమ‌వారం) త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపుతోంది.ఆయ‌న్ను హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేయించేందుకే కేసీఆర్ రాజీనామా చేయించిన‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఈట‌ల రాజేంద‌ర్‌ను ఢీ కొట్టాలంటే ఆయ‌న కంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న ప్ర‌వీణ్ కుమార్ ను అయితేనే గెలుస్తామ‌ని భావిస్తున్నారు.ఇక హుజూరాబాద్‌లో కూడా 40శాతం కంటే ఎక్కువ ఎస్సీ జ‌నాభా ఉండ‌టంతో ఎస్సీ నేత అయిన ఆర్ ఎస్‌.

ప్ర‌వీణ్ కుమార్‌కు వారంతా అండ‌గా ఉంటార‌నే ప్లాన్‌తోనే కేసీఆర్ రాజీనామా చేయించిన‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube