తెలుగులో దర్శకునిగా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ప్రశాంత్ వర్మ దర్శకునిగా మంచి పేరునే సొంతం చేసుకున్నారు.తాజాగా మీకు మాత్రమే చెప్తా కార్యక్రమానికి హాజరైన ప్రశాంత్ వర్మ అమ్మ టీచర్ అని నాన్నకు తాను క్రికెట్ ఆడటం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
అమ్మ తాను క్లాస్ లో ఎప్పుడూ టాపర్ గా ఉండాలని కోరుకునేవారని ప్రశాంత్ వర్మ చెప్పారు.బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత తాను సినిమాలకు కథలు రాయడం మొదలుపెట్టానని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
తాను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ నానికి నచ్చడంతో ఫోన్ చేసి అభినందించారని అ! సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరగా ఆ సినిమా కథ నచ్చడంతో నాని ఆ సినిమాకు నిర్మాతగా మారారని ప్రశాంత్ వర్మ అన్నారు.అ! మూవీ కథ లీక్ కాకూడదని షూటింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఫేక్ స్టోరీలను చెప్పేవాళ్లమని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.అ! సినిమాలో ఒక సీన్ కోసం 22 టేక్ లు తీశానని ప్రశాంత్ వర్మ తెలిపారు.
అ! మూవీ ప్రివ్యూ టైమ్ లో అనుష్క తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా సూపర్ హిట్ అని చెప్పారని సినిమా పూర్తైన తర్వాత అనుష్క తనను కౌగిలించుకున్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.అనుష్క తన లైఫ్ లో హగ్ చేసుకున్న మొదటి అమ్మాయని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.అనుష్క అలా చేయడంతో తనకు కన్నీళ్లొచ్చాయని అ! మూవీ హిట్ అనే నమ్మకం కలిగిందని ప్రశాంత్ వర్మ చెప్పారు.
ఒక హీరోకు కథ చెప్పాలని వెళితే బయట్ వెయిట్ చేయాలని అన్నారని ఆ సమయంలో వర్షం కురిసిందని అయితే ఆ హీరోతో తాను కలిసి పని చేశానని ప్రశాంత్ వర్మ అన్నారు.ఒక దర్శకుని దగ్గరకు డైరెక్షన్ ఛాన్స్ కోసం వెళితే మంచినీళ్లు తీసుకురావాలని చెప్పారని చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లను అలానే చూస్తారని ప్రశాంత్ వర్మ తెలిపారు.ఆ రీజన్ వల్లే తాను అసిస్టెంట్ డైరెక్టర్లను బాగా చూసుకుంటానని ప్రశాంత్ వర్మ అన్నారు.